Traveling Tips: కరోనా వేళలో తప్పనిసరి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి..ఇలా చేయండి..

Traveling Tips: కరోనా మహమ్మారి పట్టి కుదిపేస్తోంది. అడుగు తీసి అడుగేయాలంటే భయం భయంగా ఉంటోంది అందరికీ. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే..

Traveling Tips: కరోనా వేళలో తప్పనిసరి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి..ఇలా చేయండి..
Travel Tips
Follow us

|

Updated on: May 10, 2021 | 11:27 PM

Traveling Tips: కరోనా మహమ్మారి పట్టి కుదిపేస్తోంది. అడుగు తీసి అడుగేయాలంటే భయం భయంగా ఉంటోంది అందరికీ. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే.. కొన్ని సందర్భాలు అది వ్యక్తిగతం కావచ్చు.. వ్యాపారం కావచ్చు.. ఉద్యోగం కావచ్చు తప్పనిసరిగా ఏదైనా ఊరికి వెళ్ళాసిన అవసరం కొందరికి తప్పదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

మీరు ప్రయాణం ప్రారంభించడానికి ముందు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారో లేదో చెక్ చేయించుకోండి. కరోనా పరీక్షతో సహా అన్ని పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే, మీరు చిన్నపాటి అనారోగ్యమే అని బయలుదేరితే, అదే కనుక కరోనాతో వచ్చిన అనారోగ్యం అయితే, మీరు కరోనాకు వాహకంగా మారినట్టే. మీతో పాటు ప్రయాణించిన వారినందరినీ రిస్క్ లోకి నేట్టేసినట్టే.

మీరు వెళ్ళాల్సిన ప్రాంతంలో కోవిడ్ పరిస్థితి ముందుగా తెలుసుకోండి. అలాగే, అక్కడ మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో.. మీకు ఆతిధ్యం ఇచ్చే వారు బంధువులు, స్నేహితులు అయితే కనుక వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోండి. ఏమాత్రం అనుమానం ఉన్నా వేరే ప్రదేశంలో ఉండటానికి అవకాశం చూసుకోండి. ఒకవేళ మీరు హోటల్ లాంటి చోట ఉండాల్సి వస్తే.. అది కొద్దిగా రిస్కే. కానీ, తప్పనిసరి పరిస్థితి కనుక మీరు వెళుతున్న ప్రాంతంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న హోటల్ చూసుకోండి.

Traveling Tips: మీరు ఎలా ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. బస్సు, రైలు లాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించాలను కుంటే వీలైనంత సురక్షితమైన దానిని ఎంచుకోండి. ఒకవేళ మీరు మీ కారులో వెళ్ళాలనుకుంటే చాలా వరకూ మీరు క్షేమంగా ఉన్నట్టే.

ఇక మీరు వెళ్ళిన ప్రదేశంలో భోజనం చేయడానికి ఎంచుకునే ప్రదేశాన్ని ఒకటికి పదిసార్లు గమనించండి. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న హోటల్ లోనే తినడానికి ప్రయత్నించండి. భోజనానికి వెళ్ళేటప్పుడు చేతులు పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఉండే షర్ట్ ధరించడం మంచిది. అలాగే అవసరమైన అత్యవసర మందులు కూడా ఉండేలా చూసుకోండి.

వీటితో పాటు అనుక్షణం మీరు గుర్తుపెట్టుకోవల్సినది.. కరోనా నుంచి రక్షణ గురించి పాటించాల్సిన నియమాలు..

  • డబుల్ మాస్క్ ధరించండి. మీరు ఎన్నిరోజులు ఊరిలో ఉండాలో అన్ని రోజులకు సరిపడా మాస్క్ లు వెంట ఉంచుకోవడం మంచింది.
  • భౌతిక దూరం.. కచ్చితంగా మీరు దీనిని మనసులో ఉంచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళకండి.
  • మీరు అధికారిక మీటింగ్ లో పాల్గొనాల్సి ఉంటె అక్కడ కూడా వీలైనంత దూరం పాటించేందుకు ప్రయత్నించండి.
  • శానిటైజర్.. హ్యాండ్ వాష్.. ఈ రెండూ కూడా చాలా ముఖ్యం. అవకాశం ఉన్నంత వరకూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేయండి. అవకాశం లేకపోతె శానిటైజర్ ఉపయోగించండి. మీరు వెళ్ళిన ప్రాంతంలో సాధ్యమైనంత వరకూ ఏ వస్తువునూ టచ్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ టచ్ చేయాల్సి వస్తే వెంటనే శానిటైజ్ చేసుకోండి.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రయాణాలు చేసినా.. మీకు దొరికే రక్షణ 50 శాతం మాత్రమె అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

Also Read: నిరాడంబరంగా శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ.. రేపటి నుంచి భక్తుల కేశఖండన నిలిపివేత..

Snapdeal: కోవిడ్ బాధితుల పాలిట సంజీవనిగా మారిన స్నాప్‌డీల్.. బిజినెస్‌లోనే కాదు మానవత్వంలోనూ టాప్..