- Telugu News Human Interest Guinness world records how many cheerleaders can you fit in a smart car watch here this special record
వామ్మో.. నలుగురు కూర్చునే కారులో 20 మంది అమ్మాయిలు..! గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించారుగా..
Guinness World Record: సాధారణంగా మీరు కారులో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు 5గురి కంటే ఎక్కువ మంది కూర్చుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయి.కారు వెనుక సీటులో నలుగురు వ్యక్తులు కూర్చోవడమే మహా కష్టం.
Updated on: Oct 12, 2021 | 12:09 PM

సాధారణంగా మీరు కారులో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు 5గురి కంటే ఎక్కువ మంది కూర్చుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయి. కారు వెనుక సీటులో నలుగురు వ్యక్తులు కూర్చోవడమే మహా కష్టం. అలాంటిది ఒక చిన్న కారులో 20 మంది అమ్మాయిలు చొరబడి గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించారు. కొంతమంది చీర్‌లీడర్ గర్ల్స్ కలిసి ఈ ఫీట్ సాధించారు.

5 కాదు 7 కాదు ఏకంగా 20 మంది అమ్మాయిలు కారులోకి ప్రవేశించారు. ఒక చిన్న కారులో 20 మంది అమ్మాయిలంటే వారందరు ఎక్కడ సర్దుబాటు అయ్యారో తెలియడం లేదు. ప్రత్యేక విషయం ఏమిటంటే కారు కూడా పెద్ద SUV కారు కాదు. చిన్న స్మార్ట్ కారు ఇందులో 4 గురు మాత్రమే కూర్చోవచ్చు.

ఈ అమ్మాయిలు కారులోకి ఎలా ప్రవేశించారనే వీడియోను కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసింది.

ఈ రికార్డును గ్లెన్‌డేల్ చీర్లీడర్స్ టీమ్ ఆఫ్ అమెరికా చేసింది.

ఈ అమ్మాయిలు కారులో కొంచెం కూడా స్పేస్ ఉంచకుండా ఫుల్‌గా సర్దుబాటు అవ్వడం మనం ఫొటోలో చూడవచ్చు.



