Banana Benefits: రోజూ అరటిపండు తింటే ఆ వ్యాధులను తగ్గించవచ్చు…. ప్రయోజనాలు తెలుసుకోండి..
అరటి పండుతో తింటే అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ప్రతి సీజన్లో అతి తక్కువ ధరకే లభించే అరటి పండు శరీరానికి
అరటి పండుతో తింటే అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ప్రతి సీజన్లో అతి తక్కువ ధరకే లభించే అరటి పండు శరీరానికి మేలు చేస్తుంది. క్షణాల్లో ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడడమే కాకుండా…ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా అరటి పండును తినేస్తారు. అయితే అరటి పండును రోజూ తీసుకుంటే.. రక్తపోటు.. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. అలాగే ఉపవాసం సమయంలోనూ అరటి పండును తీసుకోవాలి. అరటి పండును కూరగాయలుగా.. లేదా చిప్స్ గా తీసుకోవచ్చు. అరటి పండుతో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.
1. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం వలన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరానికి పొటాషియం 9 శాతం సరఫరా చేయగలదు. 2. ఇందులో పొటాషియంతోపాటు.. యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇది పిల్లలను ఆస్తమా సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది. 3. అరటిలో ఉండే కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్స్ లెక్టిన్స్, ప్రీరాడికల్స్ నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే చిన్నతనంలో అరటిపండ్లు, నారింజ పండ్లు తినే పిల్లలు క్యాన్సర్‌కు కారణమయ్యే లుకేమియా వచ్చే ప్రమాదం తక్కువ అని ఒక పరిశోధనలో తేలింది. 4. అరటి పండులో ఉండే ఫైబర్, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ పుష్కలంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 5. రోజూ అరటి పండు తినడం వలన టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇతర ప్రయోజనాలు.. 1. అరటి పండు తినడం నలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 2. జీర్ణక్రియకు మంచిది. 3. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువ. 4. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: MAA Elections 2021: సిని “మా” రెండుగా చీలిపోతుందా.. ? వరుస రాజీనామాలు అసలు దేనికి సంకేతం..