Vastu Tips: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులున్నాయా.? వెంటనే తీసేయండి..

బెడ్‌రూమ్‌ విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య తత్సంబంధాలు ఉండాలన్నా, మంచి నిద్ర సొంతం చేసుకోవాలన్నా బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులున్నాయా.? వెంటనే తీసేయండి..
Bedroom Vastu
Follow us

|

Updated on: Aug 09, 2024 | 8:03 PM

వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నిర్మాణం విషయంలో కచ్చితంగా వాస్తును పాటించే వారు చాలా మంది ఉంటారు. ఇంటి నిర్మాణం మొదలవ్వగానే ముందుగా వాస్తు పండితుల సూచనలు పాటిస్తుంటారు. వారి సూచనల మేరకే ఇంటి నిర్మాణాన్ని మొదలుపెడుతారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో బెడ్ రూమ్‌ ఒకటి.

బెడ్‌రూమ్‌ విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య తత్సంబంధాలు ఉండాలన్నా, మంచి నిద్ర సొంతం చేసుకోవాలన్నా బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* బెడ్ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో దేవుళ్లు లేదా గురువు ఫొటోలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇది చెడుకు సంకేతమని చెబుతున్నారు.

* బెడ్‌రూమ్‌లో పని చేయని ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉంటే వెంటనే తీసి వేయాలి. పనిచేయని వస్తువులు ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బీటలు వారుతుంది. అందుకే పడకగదిలో పనిచేయని వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలి.

* పడకగదిలో వాల్ పోస్టర్‌లను అతికించుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే సముద్రం, జలపాతం వంటి ఫొటోలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటి వల్ల భార్యభర్తల మధ్య దూరం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక బెడ్ రూమ్‌లో అద్దం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బెడ్ పై పడుకున్న వారి ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుంది.

* పడకగదిలో వేసుకునే కలర్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ముదురు రంగు కలర్స్‌ను ఉపయోగించకూడదు. వీలైనంత వరకు లైట్ బ్లూ, లైట్ పింక్‌ వంటి కలర్స్‌ ఉండేలా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..