Vastu Tips: అసలు పూజ గది ఎక్కడ ఉండాలి.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..
వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా పూజ గది వీలైనంత వరకు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలలో పూజ గది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుంది. ఇక పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరాన్ని పడక గదిలో ఉంచకూడదు..

మనలో వాస్తును విశ్వసించే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇంట్లో ప్రతీ నిర్మాణంలో వాస్తు ఉండేలా చూసుకుంటారు. మరీ ముఖ్యంగా పూజ గదిలో కచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని పాటించాలని వాస్తు పండితులు చెబుతుంటారు. ఎంతో పవిత్రంగా భావించే పూజ గదిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటారు. అయితే పూజ గది విషయంలో మనలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని వాస్తు తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఎన్నో వ్యతిరేక ప్రభావాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండాలి.? ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా పూజ గది వీలైనంత వరకు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలలో పూజ గది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుంది. ఇక పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరాన్ని పడక గదిలో ఉంచకూడదు. ఇక కిచెన్‌లో కూడా పూజా గదిని ఏర్పాటు చేసుకోకూడదు. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్‌లో పూజ గదులు కిచెన్‌లో ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.
ఇక పూజ గదిలో విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చిరిగిపోయిన చిత్రపటాలు, పగిలిన విగ్రహాలు అసలు ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. పగిలిపోయిన విగ్రహాలను పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయాలి, లేదా స్థానికంగా ఉన్న ఆలయాల్లో ఉంచాలి. పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పూజ గది ఉండకూదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటివల్ల పూజ చేసిన ఫలితం కూడా ఉండదని సూచిస్తున్నారు. అలాగే పూజ గదికి వెనకాల లేదా ముందు ఎట్టి పరిస్థితుల్లో బాత్‌రూమ్ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
