Personality Traits: మీ కనుబొమ్మలను బట్టి మీరెలాంటి వారో తెలుసుకోండి..
కను బొమ్మలు వ్యక్తి అందాన్ని మరింత పెంచుతాయి. ముఖకవలికలను స్పష్టంగా చూపుతాయి. తీర్చినట్టుగా ఉండే అమ్మాయిల కనుబొమ్మలకు కుర్రకారు సైతం ఫిదా అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీ కనుబొమ్మల ఆకారం మీ వ్యక్తత్వ రహస్యాలను తెలుపుతుందని మీలో ఎంతమందికి తెలుసు..

వ్యక్తుల మనస్తత్వం, భావోద్వేగాలు, సామాజిక ప్రవర్తన, ఆంతరంగిక విషయాలు.. ఇలా ఎన్నో విషయాలను మీ ఐబ్రో షేప్ సూచిస్తుందట. ఒక్కొక్కరిలో వంపుతిరిగినట్టుగా, నల్లగా, మందంగా, పొడవుగా ఇలా రకరకాల ఐబ్రో షేప్స్ ఉంటాయి. మరి మీ కనుబొమ్మలు మీ గురించి ఏం చెప్తున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.
విల్లులాంటి ఐబ్రోస్..
మీ ఐబ్రో షేప్ మీలోని ఆత్మవిశ్వాసాన్ని గురించి తెలుపుతుందని ఫేస్ రీడింగ్ నిపుణులు అంటున్నారు. మీకు ఒకవేళ వంపు తిరిగిన విల్లులాంటి కనుబొమ్మలు ఉంటే మీరు కచ్చితంగా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. కొత్త వారితో కలిసేందుకు సమయం తీసుకుంటారు. సిగ్గరి. నలుగురిలో తొందరగా కలవలేరు. మీరెప్పుడు నిశ్చలంగా కొత్తగా ఉంటారు. పరిస్థితులు ఎలాంటివైనా తొణకకుండా మానసికంగా నియంత్రణలో ఉంటారు. మీరు ఇతరులను కమాండ్ చేసేందుకు ఇష్టపడతారు. కానీ, మంచిమనసు బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ మాటను ఇతరులు ఆచరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ మెదడుకు పదునుపెట్టే వాతావరణంలో మీరు మరింత విజయాలు సాధిస్తారు. మీ ఎమోషన్స్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంచుకుంటారు. ఆత్మపరిశీలన, ఆలోచనా శక్తి కలిగి ఉంటారని చెప్తుంది. మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి.
స్ట్రెయిట్ ఐబ్రోస్..
మీ కనుబొమ్మలు స్ట్రెయిట్ లైన్ గీసినట్టుగా ఉంటే మీరు తెలివైన వారు, చాలా విషయాల్లో క్లారిటీ ఉంటుంది. ఆవేశం కంటే ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇతరులు మిమ్మల్ని తొందరగా విశ్వసిస్తారు. ఏదైనా సలహా అడగాల్సి వస్తే ముందు మిమ్మల్నే సంప్రదిస్తారు. మీరు మీ ఎమోషన్స్ ను ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకుని రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయానికి వస్తారు. కళ్లతో చూడందే దేన్నీ ఓ పట్టాన నమ్మరు. మిమ్మల్ని అంత తొందరగా ఎవరూ మోసగించలేరు. మీ సర్కిల్ లో నమ్మదగిన వ్యక్తిగా చెలామణి అవుతారు.
కనుబొమ్మలు కలిసి ఉంటే..
స్త్రీ అయినా, పురుషులైనా సరే, కనుబొమ్మలు దగ్గరగా ఉండే వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. వారు మరొ వ్యక్తి ప్రవర్తన, భావోద్వేగాలను చాలా త్వరగా చూస్తారు, వింటారు, అర్థం చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఎవరితోనైనా వారి స్నేహం, భాగస్వామ్యం దయతో ఉంటుంది. ఈ వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు గుంపుకు దూరంగా ఉండే ధోరణిని కలిగి ఉంటారు. వారు ఎవరినీ కాపీ చేయరు, బదులుగా వారు తమను తాము ఇష్టపడతారు. కనుబొమ్మలు కలిసినవారు చాలా సృజనాత్మకతగా, నిర్మాణాత్మక ఆలోచన కలిగి ఉంటారు. వారిలో సృజనాత్మక ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
