AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birds House: ఇదొక పక్షుల బంగ్లా.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పక్షులకు వసతి కల్పిస్తున్న రైతు..!

Birds House:ఈ ఫోటోలో చూస్తున్నది శివలింగం ఆకారంలో వేలాది మట్టి కుండలతో నిర్మించిన పక్షుల ఇల్లు. పక్షుల బస, ఆహారం కోసం పూర్తి..

Birds House: ఇదొక పక్షుల బంగ్లా.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పక్షులకు వసతి కల్పిస్తున్న రైతు..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 29, 2022 | 9:27 AM

Share

Birds House:ఈ ఫోటోలో చూస్తున్నది శివలింగం ఆకారంలో వేలాది మట్టి కుండలతో నిర్మించిన పక్షుల ఇల్లు. పక్షుల బస, ఆహారం కోసం పూర్తి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఎండాకాలం అయినా, వర్షాకాలమైనా.. ఇక్కడ పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గుజరాత్‌ (Gujarat)లోని నవీ సంక్లి గ్రామంలో వేలాది తయారు చేసిన ఈ బర్డ్‌ హౌస్‌ (Birds House) పక్షులకు నిలయం మారింది. దీనిని నిర్మించిన వ్యక్తి నాలుగో తరగతి పాస్ అయిన రైతు భగవాన్ జీ భాయ్ (Bhagwanji Bhai). ది బెటర్ ఇండియా నివేదిక ప్రకారం.. 75 ఏళ్ల భగవాన్‌జీ భాయ్‌కి పక్షులంటే చాలా ఇష్టం. పక్షులకు ఆహారం పెట్టినప్పుడు, ధాన్యం తిని పక్షులు (Birds) ఎగిరిపోతుంటే, వానలో ఎక్కడ బతుకుతాయోనని దిగులు పడ్డాడు పడేవాడు.

అతను ఎంతో ఖర్చుతో 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో ఒక బర్డ్ హౌస్ను నిర్మించాడు. ఇందులో దాదాపు 2500 చిన్న, పెద్ద కుండలను ఉపయోగించారు. అతను నిర్మించిన ఈ అందమైన పక్షుల ఇల్లు అతని గ్రామానికి గుర్తింపుగా మారింది. వేసవిలో పక్షులు ఇక్కడ చల్లగా ఉంటాయి. అయితే వర్షంలో కూడా తడవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Birds House1

దీన్ని సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పట్టగా 20 లక్షల రూపాయలు వెచ్చించినట్లు ఆ రైతు చెబుతున్నాడు. అతని వయసు 75 ఏళ్లు. 100 ఎకరాల పొలాన్ని చూసుకుంటున్న అతను ఆగ్రో కంపెనీ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ పక్షి గృహంలో పావురాలు, చిలుకలతో సహా అనేక రకాల పక్షులు నివసిస్తాయి. ఈ పక్షుల నివాసం శివలింగం ఆకారంలో ఉంటుంది. గతంలో భగవాన్‌జీ భాయ్ గ్రామంలో శివాలయాన్ని కూడా నిర్మించారు. భగవాన్‌జీ భాయి నిర్మించిన పక్షుల గృహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

Bizarre Radio Signal: ఖగోళ శాస్త్రవేత్తలను వెంటాడుతున్న రహస్యం.. సుదూరంలో ఉన్నపాలపుంత నుంచి రేడియో సంకేతాలు

TRAI New Guidelines: టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు.. కస్టమర్లకు ఊరట..!

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..