Dussehra-2025: దసరా పండగ ఎప్పుడు? అక్టోబర్ 1న లేదా 2వ తేదీనా..?
Dussehra-2025: దసరా రోజున రావణ కాష్టాను నిర్వహిస్తారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి చిహ్నంగా దసరాను భావిస్తారు. దసరా సందర్భంగా దుర్గా పూజ కూడా ముగుస్తుంది. ఈ రోజున ఆయుధాలను పూజించాలనే ఆచారం కూడా ఉంది. మరి ఈ ఏడాది దసరా పండగ ఎప్పుడో తెలుసుకుందాం..

దసరా ప్రధాన పండుగలలో ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం అశ్విని మాసం శుక్ల పక్ష దశమి రోజున దసరా (విజయదశమి) పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకొంటారు. దసరా రోజున రావణ కాష్టాను నిర్వహిస్తారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి చిహ్నంగా దసరాను భావిస్తారు. దసరా సందర్భంగా దుర్గా పూజ కూడా ముగుస్తుంది. ఈ రోజున ఆయుధాలను పూజించాలనే ఆచారం కూడా ఉంది. మరి ఈ ఏడాది దసరా పండగ ఎప్పుడో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Expensive Fruits: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏది? దీని ధర రూ.24 లక్షలు!
2025లో దసరా తేదీ:
ద్రిక్ పంచాంగ్ ప్రకారం.. దసరాకు అశ్విన్ శుక్ల దశమి తిథి అక్టోబర్ 1న సాయంత్రం 7:01 గంటలకు ప్రారంభమవుతుంది. దశమి తిథి అక్టోబర్ 2న సాయంత్రం 7:10 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ఆధారంగా దసరా అక్టోబర్ 2న జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా, దేశం మొత్తం ఈ పవిత్రమైన పండుగను జరుపుకుంటుంది. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత సంప్రదాయాలు, ఈ రోజును ఎలా జరుపుకోవాలో వంటి ఆచారాలు ఉన్నాయి.
Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ ఉంటేనే స్టేషన్‌లోకి అనుమతి.. ఈ స్టేషన్ నుంచి ట్రయల్
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








