Dream: కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

మనం కనే కలలు మనకు జరగబోయే మంచి లేదా చెడును సూచిస్తాయని పండితులు అంటున్నారు. మరి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో పాము కనిపించగానే ఒక్కసారిగా భయపడతాం, ఉలిక్కి పడుతాం. అయితే కలలో పాము కనిపించడం వెనకాల అసలు అర్థం ఏంటి? స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం తెలిపారంటే..

Dream: కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
Snake In Dream
Follow us

|

Updated on: May 06, 2024 | 9:05 PM

నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో దాదాపు ప్రతీ ఒక్కరికీ ఏదొ ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని కలలు మనకు మంచి భావనను కలిగిస్తే మరికొన్ని మాత్రం ఉలిక్కిపడేలా చేస్తాయి. ఇదిలా ఉంటే మనకు కనిపించే ఏ కల అయినా మన జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధించినవి ఉంటాయిన స్వప్న శాస్త్రం చెబతోంది.

మనం కనే కలలు మనకు జరగబోయే మంచి లేదా చెడును సూచిస్తాయని పండితులు అంటున్నారు. మరి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో పాము కనిపించగానే ఒక్కసారిగా భయపడతాం, ఉలిక్కి పడుతాం. అయితే కలలో పాము కనిపించడం వెనకాల అసలు అర్థం ఏంటి? స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం తెలిపారంటే..

* ఒక వ్యక్తికి కలలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ కలలో పామును చంపినట్లు కల వస్తే, పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి.

* ఒక చచ్చిన పాము కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు రానున్న రోజుల్లో మంచి జరగనుందని అర్థం. ఏదో మంచి జరుగుతుందని చెబుతున్నారు.

* ఒకవేళ పాము కోరలు తెరిచినట్లు కనిపిస్తే మాత్రం మీకు కావాల్సిన వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని భావించాలి.

* తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఊహించని సంపద మీకు దక్కబోతుందని అర్థం.

* మీపై పాము ఎక్కుతున్నట్లు కల వస్తే.. మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని, వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ పాము మిమ్మల్ని కాటు వేసినట్లు కల వస్తే మంచికి సూచిక అని పండితులు చెబుతున్నారు. ఏళ్లుగా పడుతోన్న ఇబ్బందులు, అప్పుల నుంచి విముక్తి లభించనున్నట్లు అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా వచ్చినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి