AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Update: వివాహం తర్వాత పేరు మారినట్లయితే ఆధార్ కార్డ్‌లో ఎలా మార్చుకోవాలో తెలుసా.. ఇంట్లో నుంచే ఇలా చేయండి..

ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నుంచి ఐటీఆర్ ఫైలింగ్ , బ్యాంకు వ్యవహారాల వరకు ఆధార్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో ఏ పనిలోనైనా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా అవసరం అవుతుంది.

Aadhaar Card Update: వివాహం తర్వాత పేరు మారినట్లయితే ఆధార్ కార్డ్‌లో ఎలా మార్చుకోవాలో తెలుసా.. ఇంట్లో నుంచే ఇలా చేయండి..
Aadhaar
Sanjay Kasula
|

Updated on: Mar 27, 2022 | 6:25 PM

Share

ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నుంచి ఐటీఆర్ ఫైలింగ్(ITR Filing) , బ్యాంకు వ్యవహారాల వరకు ఆధార్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో ఏ పనిలోనైనా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా అవసరం అవుతుంది. అంటే భారత దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రం. ఈ కారణంగా దీన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం కూడా అవసరం.. ఎందుకంటే అప్‌డేట్ చేయకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో, ఆధార్ కార్డ్‌పై దిద్దుబాటు, నవీకరణ, ఇతర సమాచారాన్ని జోడించే సౌకర్యం ఇవ్వబడింది. UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో కాని లేదా సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వినియోగదారుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్ , ఇ-మెయిల్ చిరునామా వంటి వివరాలను మార్చుకోవచ్చు.

మరోవైపు, మీరు ఇటీవల వివాహం చేసుకుని, మీ ఆధార్‌లో మీ పేరును అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు దానిని ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని ఈ పని చేయవచ్చు. లేదా మీ పేరులో ఏదైనా తప్పు ఉంటే.. మీరు ఇలా మార్చవచ్చు. ఆధార్‌లో మీ పేరును ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ దశల వారీ ప్రక్రియ తెలుసుకుందాం..

  1. ముందుగా, మీరు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి.
  2. ఆ తర్వాత My Aadhaar విభాగంలో ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్‌లైన్’కి వెళ్లండి.
  3. ఇప్పుడు ఒక కొత్త ట్యాబ్ తెరుచుకుంటుంది. అందులో ‘ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత OTP పంపబడుతుంది.
  5. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేసిన తర్వాత ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా’పై క్లిక్ చేయండి.
  6. ఇప్పుడు మీరు ఏమి మార్చాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  7. దీనితో పాటు, మీరు పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు పాన్, పాస్‌పోర్ట్ మొదలైన గుర్తింపు రుజువు స్కాన్ చేసిన కాపీని సమర్పించాలి.
  8. పత్రాలు అప్‌లోడ్ చేయబడి.. సరైన వివరాలను నమోదు చేసిన తర్వాత మీరు చెల్లింపు చేయడానికి దారి మళ్లించబడతారు.
  9. చెల్లింపు పూర్తయిన తర్వాత, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) జనరేట్ చేయబడుతుంది. మీరు మీ రసీదు కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో కూడా పేరు మార్చుకోవచ్చు

  1. సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
  2. మీరు మీ సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఒరిజినల్ కాపీలను కేంద్రానికి తీసుకెళ్లాలి.
  3. ఆఫ్‌లైన్ పేరు మార్పు ప్రక్రియ కోసం మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

Yogi Cabinet: ఒకప్పుడు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..