AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency: నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.?

భారత్‌లో నాణేల కంటే కరెన్సీ నోట్లే ఎక్కువని తెలిసిందే. మన దగ్గరకు వచ్చే ప్రతీ నోటును భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తుంది. దేశంలో చాలా చోట్ల ఇలాంటి నోట్ల ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ముద్రించిన నోట్లను దేశవ్యాప్తంగా సర్క్యూలేట్ అవుతుంటాయి. అయితే నోట్లను ముద్రించేందుకు ఆర్‌బీఐ ఎంత ఖర్చు చేస్తుందన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా.?

Currency: నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.?
Currency Printing
Narender Vaitla
|

Updated on: Sep 12, 2024 | 10:00 PM

Share

భారత్‌లో నాణేల కంటే కరెన్సీ నోట్లే ఎక్కువని తెలిసిందే. మన దగ్గరకు వచ్చే ప్రతీ నోటును భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తుంది. దేశంలో చాలా చోట్ల ఇలాంటి నోట్ల ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ముద్రించిన నోట్లను దేశవ్యాప్తంగా సర్క్యూలేట్ అవుతుంటాయి. అయితే నోట్లను ముద్రించేందుకు ఆర్‌బీఐ ఎంత ఖర్చు చేస్తుందన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా.? ఇంతకీ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో నోట్ల ముద్రణ 1957 నుంచి జరుగుతోంది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. వెయ్యి రూ. 10 నోట్లను ముంద్రించడానికి సుమారు రూ. 960 ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ లెక్కన ఒక్క రూ. 10 నోటుకు ప్రభుత్వం 96 పైసలు ఖర్చు చేస్తుంది. ఇక వెయ్యి రూ. 20 నోట్ల ముద్రణ చేయడానికి రూ. 950 ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఒక్క రూ. 20 నోటును ముద్రించేందుకు 95 పైసలు ఖర్చవుతుంది.

ఇక 2021-22 ఏడాదిలో వెయ్యి రూ. 50 నోట్ల ముద్రణకు రూ. 1,130 ఖర్చవుతుంది. అంటే ఒక్క 50 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐ సుమారు రూ. 1.13 పైసలు ఖర్చు చేస్తుంది. ఇక వెయ్యి రూ. 100 నోట్లను ముంద్రించేందుకు ఆర్బీఐ రూ. 1770 ఖర్చు చేస్తుందని తెలిపింది. అంటే ఒక్క రూ.100 నోటును ముద్రించేందుకు ఆర్బీఐ రూ.1.77 ఖర్చు చేస్తుంది. ఇక రూ. 200 నోటు విషయానికొస్తే వెయ్యి రూ. 200 నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ రూ. 2370 ఖర్చు చేస్తుంది.

అంటే ఒక్క రూ. 200 నోటును ముద్రించేందుకు రూ. 2.37 ఖర్చవుతుంది. ఇక 2021-22 ఆర్థిక ఏడాదిలో వెయ్యి రూ. 500 నోట్లను ముద్రించేందుకు రూ. 2290 ఖర్చయింది. ఈ లెక్కన ఒక్క రూ. 500 నోటును ముద్రించేందుకు రూ. 2.29 ఖర్చవుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..