Car Discounts: రాయితీలతో ఆకట్టుకుంటున్న కార్ల కంపెనీలు..జూలై నెలలో భారీ డిస్కౌంట్లు.. ఏ కారుకి ఎంతో తెలుసుకోండి!

Discount on Cars: వాహనాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీని కారణంగా కార్ల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.

Car Discounts: రాయితీలతో ఆకట్టుకుంటున్న కార్ల కంపెనీలు..జూలై నెలలో భారీ డిస్కౌంట్లు.. ఏ కారుకి ఎంతో తెలుసుకోండి!
Discount On Cars
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 16, 2021 | 10:28 AM

Car Discounts: వాహనాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీని కారణంగా కార్ల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయినా, కార్లను కోణాలనుకునే వారి కోసం కంపెనీలు ఈ నెలలో శుభవార్త చెబుతున్నారు. కార్ల అమ్మకపు కంపెనీలు కారును కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు ఈ నెలలో మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో టాటా మోటార్స్ గరిష్టంగా 70 వేల రూపాయలు, మారుతి 54 వేల రూపాయలు, హ్యుందాయ్ తన వివిధ మోడళ్లలో రూ .1.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, అదేవిధం కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆయా కంపెనీల వెబ్సైట్ లు ఇచ్చిన వివరాల ప్రకారం వివిధ కార్ల కంపెనీల డిస్కౌంట్ ఆఫర్స్ ఇలా ఉన్నాయి.

మారుతీ సుజుకీ..

  • ఆల్ట్రో 800 ప్రారంభధర 3 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 43 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • సిలేరో ప్రారంభధర 4.66 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 18 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • ఎస్ ప్రేసో ప్రారంభధర 3.78 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 43 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • వ్యాగన్ ఆర్ ప్రారంభధర 4.81 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 33 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • స్విఫ్ట్ ప్రారంభధర 5.81 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 54 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • డిజైర్ ప్రారంభధర 5.98 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 34 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • బ్రెజా ప్రారంభధర 7.52 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 39 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.

టాటా మోటార్స్..

  • టియాగో ప్రారంభధర 6.14 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 28 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • టిగోర్ ప్రారంభధర 5.59 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 33 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • నేక్సన్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభధర 7.19 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 3 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • నేక్సన్ డీజిల్ వెర్షన్ ప్రారంభధర 8.49 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 20 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • నేక్సన్ ఈవీ ప్రారంభధర 16 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 15 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • హైరియర్ ప్రారంభధర 14.29 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 70 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.

హ్యుందాయ్ మోటార్స్

  • శాంత్రో ప్రారంభధర 4.73 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 40 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • ఐ 10 గ్రాండ్ నియోస్ ప్రారంభధర 45.23 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 50 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • ఆరా ప్రారంభధర 5.97 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 50 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • కోనా ఎలక్ట్రిక్ ప్రారంభధర 23.7 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 1.5 లక్షల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • ఐ20 ప్రారంభధర 6.85 లక్షల రూపాయలు ఉంది. ఈ కారుపై 40 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన అన్ని డిస్కౌంట్ ఆఫర్ల సమాచారం ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుండి తీసుకోబడింది. ఈ ఆఫర్లు డీలర్షిప్ నుండి డీలర్షిప్ వరకు మారవచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకోవచ్చు. అందువల్ల వినియోగదారులు తమ డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా వారి డిస్కౌంట్ ఆఫర్లను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Ola Electric Scooter: గుడ్‌న్యూస్‌.. కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.499తో బుక్ చేసుకోండిలా!

WhatsApp Accounts Banned: కస్టమర్లకు షాకింగ్‌.. భారత్‌లో 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!