Chanakya Niti: ఈ ఐదు విషయాలను అనుసరించండి.. మీ జీవితం పూల బాటే..

ఆచార్య చాణక్యుడి గ్రంథంలో పేర్కొన్న ఈ ఐదు విషయాలను ఎవరు గ్రహిస్తారో వారు తమ జీవితంలో విజయం సాధిస్తారు. చాణక్యుడు చెప్పిన దానిని స్వీకరించిన వారి జీవితం అందంగా ఉంటుంది.

Chanakya Niti: ఈ ఐదు విషయాలను అనుసరించండి.. మీ జీవితం పూల బాటే..
Chanakya Niti
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 14, 2021 | 9:02 AM

ఆచార్య చాణక్యుడి రచించిన చాణక్య నీతి గ్రంథంలోని ఈ ఐదు విషయాలను ఎవరు గ్రహిస్తారో వారు తమ జీవితంలో విజయం సాధిస్తారు. చాణక్యుడు చెప్పిన దానిని స్వీకరించిన వారి జీవితం అందంగా ఉంటుంది. కష్టాలు వారికి దూరంగా ఉంటాయి. ఆచార్య చాణక్యుడు తన విధాన గ్రంథాలలో పురుషుల జీవితాలలో ఉపయోగపడే విషయాలన్నింటినీ అందులో పేర్కొన్నాడు. ఆ విధానాలు నేటి తరంవారికే కాకుండా ఎప్పటికీ  ఉపయోగపడేలా ఉంటాయి.  ప్రపంచంలో ఎవరి ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయో చెప్పండి? రోగాలు, దుఃఖాలు లేని వారెవరో చెప్పండి? ఎవరు ఆనందంలో మునిగిపోయారో చెప్పండి? ఈ ప్రశ్నలలో జీవిత సాధనకు మార్గం.. అంతేకాదు జీవిత యోగ్యత నిర్ణయించబడుతుంది.  సంతోషం, దుఃఖం అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివని అంటారు ఆచార్య చాణక్యుడు. మీ విలువైన జీవితానికి సమయం చూసి నాణెం తన ముఖాలను పరిచయం చేస్తుంది.

కానీ మానవులు తమ జీవితాలలో ఎదుర్కొనే కష్టాలను నివారించవచ్చు. దుఃఖాన్ని అంతం చేయవచ్చు. ఆచార్య చాణక్యుడు తన గ్రంధంలో ఇటువంటి జీవితం గురించి అనేక ఆధారాలు ఇచ్చాడు. ప్రజలకు అవగాహన ఉంటే జీవితంలోని కష్టాలను దూరం చేసుకుంటూ హుందాగా.. సమయానుకూలంగా జీవించవచ్చు.  

1. మనిషి తన జీవితంలో కీర్తి ప్రతిష్టలు తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో దానిపై ఆధారపడి ఉంటుంది. అతని చరిష్మా పెరుగుతుంది. ప్రేమను పంచుకోవడంలో అతని జీవిత నాణ్యతను పెంచుతుంది. ఈ విషయాల ఆధారంగా ఒక వ్యక్తి దానిని సాధించాలనే మనసుతో ఉంటే అతని జీవితం అందంగా మారుతుంది.

2. ఒకటరికి భోజనం పెట్టలేని తపస్సు, పుణ్యం తాత్కాలికమైనదని ఆచార్యడు చెప్పారు. కానీ మీరు దానిని అర్హులైన ఎవరికి దానం చేస్తే మీరు మీ దాతృత్వానికి ప్రయోజనం పొందుతారు. అలాంటి ధర్మం చాలా కాలం ఉంటుంది. తత్ఫలితంగా ధర్మం అనేది నిలిచి ఉంటుంది.  కాబట్టి దానధర్మం ఒక విలువైన కారణం.

3. పుట్టుకతో అంధుడిగా ఉన్నవాడు నిస్సహాయులు..  కానీ సంపదకు అహంకారానికి లొంగినవారు స్వీయ అంధులు. కాబట్టి ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి జీవితాన్ని అందంగా మార్చుకోండి అని ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంధంలో తెలిపారు.

4. అత్యాశగల మనిషికి బహుమతిని అందించడం వల్ల సులభంగా సంతృప్తి చెందవచ్చు. మూర్ఖుడిని సత్కరించి సంతోషపెట్టవచ్చు అదే పండితుడికి నిజం చెప్పి సంతోషపెట్టవచ్చు అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. 

5. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పినట్లుగా.. వ్యక్తి ఆభరణాలు, వస్త్రధారణలో అందంగా కనిపించడు. బదులుగా  అతను చేసే దాతృత్వంతో తనను తాను అలంకరించుకుంటాడు. మీరు ఆధ్యాత్మిక జ్ఞానం-ధ్యానం మార్గంలో వెళితే జీవితం సరళంగా అందంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Rs 10 Thousand Notes: మళ్లీ రూ.10 వేల నోట్లు ముద్రిస్తున్నారా.. ఆసక్తికర విషయాలు మీ కోసం..

Weather Alert: మరో మూడు రోజుల పాటు జోరు వానలు.. తాజా హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ