Great Police Video: గొప్ప మనసు చాటుకున్న పోలీసులు.. బాలుడికి పోలీస్ డ్రెస్ గిఫ్ట్.! ఆకట్టుకుంటున్న వీడియో..
పోలీసుల అంటేనే చాలామందికి భయంవేస్తుంది. అంతేకాదు పైగా వాళ్లు వృత్తి స్ట్రిక్ట్ ఉండాల్సి రావడం వల్లనో తెలియదు గానీ చాలా మంది ప్రజలకు పోలీసులపై సదాభిప్రాయం ఉండదు. కానీ ఈ ఆస్ట్రేలియా పోలీసునే చూస్తే కచ్చితంగా అభిప్రాయం మారతుందని చెప్పక తప్పదు.
ఆస్రేలియాకి చెందిన ఒక బాలుడు లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు యెప్రాడ్ రూస్టర్ అనే కోడిపిల్లను పెంచకుంటున్నాడు. ఆ బాలుడి పెంపుడు కోడిపిల్ల రాత్రిళ్లు విపరీతంగా శబ్దం చేస్తుందంటూ ఇరుగు పోరుగు వాళ్లు పోలీసులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ బాలుడి తండ్రి పోలీసులు ఇంకో పదిరోజుల్లో తమ కొడుకు పెంచుకుంటున్న కోడిపిల్లను తీసుకువెళ్లిపోతారని తెలిసి పోలీసులకు తమ సమస్యను వివరించారు.
ఈ క్రమంలో ఫెయిర్‌ఫీల్డ్ సిటీ పోలీస్ కానిస్టేబల్ ఫ్రాంకీ వారి బాధను అర్థం చేసుకోవడమే కాక మీ కొడుకు ఏమి కాదని తెలిపారు. పైగా తమకు అందమైన పోలం ఉందని అక్కడ ఈ యెప్రాడ్ రూసర్ హాయిగా పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు నీవు ఎప్పుడూ కావల్సి వస్తే అప్పుడు ఈ రూస్టర్‌ని వచ్చి చూడవచ్చు అని ఆ బాలుడికి హామీ ఇచ్చారు పోలీసులు. ఈ మేరకు ఆ బాలుడికి బొమ్మలు, పోలీస్ యూనిఫాం, టోపి వంటి బహుమతులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…