AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బే.. డబ్బు..

ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి...

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బే.. డబ్బు..
Chanakya Niti
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2021 | 9:30 AM

Share

ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనను కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనే అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు.  ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి ఆచార్య చాణక్యుడు ఇచ్చిన విధానాలను సరిగ్గా పాటిస్తే అతను ఎదుర్కొంటున్న కష్టాలన్నీ దూదిపింజలా ఎగిరిపోతాయి. అంతే కాదు అవి వారి విజయానికి రహదారులుగా మారుతాయి. జీవితంలో పాటించాల్సిన ఎథిక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పారు.

తెలివైన వ్యక్తిని గౌరవించండి

ఆచార్య చాణక్య ప్రకారం జ్ఞానాన్ని గౌరవించే ఇంట్లో  లక్ష్మి దేవి నివాసం ఉంటుందని అంటారు. చాణక్య నీతి ప్రకారం తెలివితక్కువ వ్యక్తి నుండి మీరు ప్రశంసలను పొందడం కంటే.. తెలివైన వ్యక్తి నుంచి తిట్లు తినడం చాలా  ప్రయోజనకరం. జ్ఞానవంతులైన వ్యక్తులతో మనం సహవాసం చేయాలి.. వారిని గౌరవించాలి.

ఆహారాన్ని గౌరవించండి

మీ ఇంట్లోని వంట గదితోపాటు ఆహారంను నిల్వ చేసే గదిని కూడా జాగ్రత్తగా పెట్టుకోవలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ ఆహారం కొదవ ఉండదు. చాణక్యుడు చెప్పిదాని ప్రకారం ఆహారాన్ని గౌరవించే వారి ఇంట్లో లక్ష్మికి ఎప్పుడూ కొరత ఉండదు. ఆహారాన్ని గౌరవించని వారితో లక్ష్మి దేవి ఎప్పుడూ ఉండదని నమ్ముతారు.

భార్యాభర్తల మధ్య ప్రేమ, భక్తి

ఆచార్య చాణక్య ప్రకారం ప్రేమ, ఆనందం ఉండే ఇంట్లో లక్ష్మి దేవి నివాసం ఉంటుంది. సంబంధాలలో ఒకరికొకరు గౌరవం ఉన్నచోట ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఇంట్లో పేదరికం తిష్ట వేసుకుని కూర్చుకుంటుంది. అందుకే ప్రతి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలని తాను రచించిన పుస్తకం ఈ వివరాలను స్పష్టంగా చెప్పారు. 

ఇవి కూడా చదవండి: Consumer Right: మీరు తినే ఐస్ క్రీం ప్రమాదకారి కావొచ్చు.. తెలుసా..? ఆ కోడ్ లేకపోతే నకిలీదే..

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు