Interest Rates: సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్ల తగ్గింపు.. వివరాలు తెలుసా..?
Small Saving Scheme Interest Rates: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు భారీగా షాకిచ్చింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి ప్రతికూల ప్రభావం
Small Saving Scheme Interest Rates: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు భారీగా షాకిచ్చింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ మేరకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గత మూడు త్రైమాసికాలుగా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న వడ్డీ రేట్లను.. తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 అంటే.. ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించి.. 40 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్యలో కోత విధించింది. పలు పథకాల్లో తాజాగా తగ్గించిన వడ్డీ రేట్ల వివరాలు..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. పీపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతం కిందకు రావడం గత 46 ఏళ్లల్లో ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటు 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గింది.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ (SSYS) విషయానికి వస్తే.. దీనిపై ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 1.1 శాతం వరకు తగ్గింది. వీటిపై వడ్డీ రేటు 4.4 శాతం నుంచి 5.3 శాతం మధ్యలో ఉంది. అయితే గతేడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
కొత్త వడ్డీ రేట్ల వివరాలు..
అయితే.. పొదుపు డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు. టర్మ్ డిపాజిట్ పథకాల గురించి మాట్లాడితే.. ఏడాది టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. రెండు సంవత్సరాల డిపాజిట్లపై వడ్డీ రేటును 5.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మూడేళ్ల వాటిపై.. 5.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గించగా.. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించారు. కాగా.. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల లెక్కింపు ప్రతీ మూడు నెలలకొకసారి జరుగుతుంది. అయితే ఈ వడ్డీ రేట్లు మళ్లీ జూన్ 30న మారనున్నాయి.