Night Driving Safety Tips: రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే, ఇవి తప్పక పాటించండి.. సేఫ్‌గా ఉంటారు..

|

Sep 04, 2023 | 6:46 AM

Night Driving Safety Tips: మీరు వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అందులోనూ నైట్ టైమ్ డ్రైవింగ్‌కి వెళ్తున్నారా? ఒకవేళ మీరు రాత్రిపూట ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లయితే కచ్చితంగా ఈ టిప్స్ పాటించాల్సిందే. ఈ టిప్స్ మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూసేయండి.

Night Driving Safety Tips: రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే, ఇవి తప్పక పాటించండి.. సేఫ్‌గా ఉంటారు..
Night Time Driving
Follow us on

Night Driving Safety Tips: మీరు వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అందులోనూ నైట్ టైమ్ డ్రైవింగ్‌కి వెళ్తున్నారా? ఒకవేళ మీరు రాత్రిపూట ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లయితే కచ్చితంగా ఈ టిప్స్ పాటించాల్సిందే. ఈ టిప్స్ మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూసేయండి.

కార్ పూర్తిగా చెక్ చేయాలి..

మీరు రాత్రి సమయంలో ప్రయాణం ప్రారంభించినట్లయితే.. ముందుగా మీరు కారు లైట్లను పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాత్రి ప్రయాణం వీటి ఆధారంగా నిర్ణయించుకోవాలి. వాటిలో ఏదైనా సమస్య ఉంటే మీ ప్రయాణం కష్టం అవుతుంది. దీంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అందుకే.. లైట్స్ పనితీరును చెక్ చేసుకోవాలి. అలాగే కారులో అన్ని అంశాలను చెక్ చేసుకోవాలి.

టైర్‌లో గాలిని సరిగా చూసుకోవాలి..

ప్రయాణంలో రెండవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వాహనంలోని అన్ని టైర్లలో గాలి సరైన మొత్తంలో ఉండాలి. తద్వారా మీ కారు ఇంజిన్‌పై ఒత్తిడి ఉండదు. మంచి మైలేజీ కూడా పొందవచ్చు. వీలైతే, ఈ పనిని ముందుగానే చేయండి. ఎందుకంటే రాత్రి సమయంలో ఎయిర్‌ పంప్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఉదయం సమయంలో కారు టైర్లలో గాలి చెక్ చేయించి, ఫిల్ చేయించుకోండి.

ఇవి కూడా చదవండి

ఇంధనం ఫుల్‌గా ఉండాలి..

మరో ముఖ్యమైన విషయం ఇంధనం. మీరు ప్రయాణం చేసే సమయంలో మీ కారులో ఇంధనం ఫుల్‌గా ఉండేలా చూసుకోవాలి. చాలా సార్లు ప్రజలు మార్గం మధ్యలో నింపుకుందాం లే అని భావిస్తుంటారు. కానీ, ఇది పెద్ద పొరపాటు. ఒకవేళ మార్గం మధ్యలో పెట్రో పంప్స్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే.. మీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ముందుగా మీ కారులో ఇంధనం ఫుల్ చేసుకోవాలి. తద్వారా హ్యాపీగా గమ్యం చేరుకుంటారు.

విండ్ స్క్రీన్ శుభ్రంగా ఉండాలి..

కారును ఎక్కువ సమయంలో నిలిపి ఉంచడం వలన అద్దాలపై దుమ్ము, దూళి పడుతుంది. దాని అద్దాలను శుభ్రం చేయడంలో అలసట వహిస్తారు. అయితే, ఇది వారికి సమస్యగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పాలి. విండ్‌స్క్రీన్‌తో పాటు వాహనం అన్ని అద్దాలను పూర్తిగా శుభ్రం చేయాలి. క్యాబిన్ లోపల, బయట మొత్తం గ్లాస్‌లను శుభ్రం చేయాలి.

వేగం, కాంతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వేగాన్ని తక్కువగా అంచనా వేయవచ్చు. కాబట్టి వేగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నిర్దేశించిన పరిమితిలో డ్రైవ్ చేయండి. అలాగే, హై బీమ్‌కు బదులుగా లైట్‌ను తక్కువగా ఉంచి, మధ్యలో హై బీమ్‌ని ఆన్ చేయడం ద్వారా ముందున్న రహదారిపై అప్రమత్తంగా ఉండాలి.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..

మీరు ఇప్పటికే అన్ని నైట్ డ్రైవింగ్‌కు రెడీ అయినట్లయితే.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అలర్ట్ మోడ్‌లో ఉండాలి. కారు నడుపుతున్నంతసేపు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట జంతువులు అక్కడక్కడ ఎక్కువ తిరుగుతుంటాయి. ఏ సమయంలోనైనా హఠాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో, మీరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. డ్రైవింగ్‌ సమయంలో నిరంతం అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..