AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona New Variant: తొమ్మిది దేశాల్లో క‌రోనా కొత్త వేరియంట్.. 36 మ్యుటేషన్లతో దడపుట్టిస్తున్న ‘పిరోలా’..

కరోనా మహమ్మారి మనల్ని వదిలేలా లేదు. ఎంత దూరం తరిమికొడుతున్నా కొత్త రూపం సంతరించుకొని అది మళ్లీ, మళ్లీ మన మీద దాడి చేస్తూనే ఉంది. 2020-21 మధ్యకాలంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించిన. ప్రజలకు గుండెదడ పుట్టించింది. ఎంతోమంది పొట్టబెట్టుకున్న ఈవైరస్ ప్రభావం తగ్గిపోయిందని అంతా ఊపిరి పిల్చుకున్నారు. కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉంది అంటోంది కొత్త వేరియంట్. ఈ వైరస్ పూర్తిగా కనుమరుగు కాకపోయినా..

Corona New Variant: తొమ్మిది దేశాల్లో క‌రోనా కొత్త వేరియంట్.. 36 మ్యుటేషన్లతో దడపుట్టిస్తున్న ‘పిరోలా’..
Corona Virus
Shiva Prajapati
|

Updated on: Sep 04, 2023 | 5:02 AM

Share

ముందు కరోనా.. తర్వాత ఒమిక్రాన్.. నిన్న ఎరిస్.. నేడు పిరోలా. మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ప్రపంచాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ ధాటిని చూస్తే.. మిగతా దేశాల్లో కూడా అలర్ట్ తప్పదన్న క్లారిటీ వస్తోంది. అసలు ఏంటా వేరియంట్.. ఇప్పటి వరకు ఎన్ని దేశాలపై ఎటాక్‌ చేసింది..? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న ‘పిరోలా’..

కరోనా మహమ్మారి మనల్ని వదిలేలా లేదు. ఎంత దూరం తరిమికొడుతున్నా కొత్త రూపం సంతరించుకొని అది మళ్లీ, మళ్లీ మన మీద దాడి చేస్తూనే ఉంది. 2020-21 మధ్యకాలంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించిన. ప్రజలకు గుండెదడ పుట్టించింది. ఎంతోమంది పొట్టబెట్టుకున్న ఈవైరస్ ప్రభావం తగ్గిపోయిందని అంతా ఊపిరి పిల్చుకున్నారు. కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉంది అంటోంది కొత్త వేరియంట్. ఈ వైరస్ పూర్తిగా కనుమరుగు కాకపోయినా.. జనాలు దీంతో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అలా అంతా సెట్ అనుకున్న సమయంలో.. కరోనా రక్కసి తన రూపాల్ని మార్చుకుంటోంది. మళ్లీ మళ్లీ ప్రపంచంపై తిరిగి దాడి చేస్తోంది. తాజాగా ఈ వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గత భయానక పరిస్థితులను మరువక ముందే.. ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి, డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచ దేశాలు మళ్లీ అలర్ట్‌ అయ్యేలా చేస్తోంది. ఆ కొత్త వేరియంట్‌ పేరు BA.2.86, పిరోలా. ఇది ఒమైక్రాన్‌ వేరియంట్‌కి సబ్ వేరియంట్‌ అట. ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే పిరోలాలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని, అందువల్లే అది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో కనుగొన్న పిరోలా..

పిరోలా 2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో మొదటి సారి కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికా, బ్రిటన్, చైనా ఇజ్రాయెల్, కెనడా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. యూకేలో కొత్తగా తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. ఇది టీకాలు తీసుకున్న వ్యక్తులకు కూడా సోకుతుంది. అయితే తాజా వేరియంట్‌కి సంబంధించిన సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉన్నందునా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. పిరోలాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం దాని వ్యాప్తి గురించి అంచనాకి రావడం కాస్త కష్టంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

36 మ్యుటేషన్లతో దడపుట్టిస్తున్న ‘పిరోలా’..

కొత్త వేరియంట్ పిరోలా లక్షణాలు ఇతర కోవిడ్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, నిరంతర తలనొప్పి, కండరాల తిమ్మిరి, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, చికాకు, నీరసం దీని లక్షణాలు తెలిపారు. పిరోలా వేరియంట్‌లో ఉత్పరివ‌ర్తనాలు భిన్నంగా ఉన్నాయ‌ని, ఇందులో మొత్తం 36 మ్యుటేష‌న్లు ఉన్నాయ‌ని నిపుణులు చెప్తున్నారు. ఇవి రోగ నిరోధ‌క వ్యవ‌స్థ నుంచి సుల‌భంగా త‌ప్పించుకోగ‌ల‌వ‌ని, త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందికి సోకే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదరకమైనది అని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఇంకా పిరోలాపై అధ్యయనం చేస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us