AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె 5 సెకన్లలో ఇందులో DOG ని గుర్తించండి చూద్దాం..!

ఆప్టికల్ ఇల్యూషన్లు మన మానసిక సామర్థ్యాలను అంచనా వేయడానికి రూపొందించబడ్డాయి. ఇవి సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, మెమొరీ శక్తిని పరీక్షిస్తాయి. మన మేధస్సు ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. నిరంతరం ఇలాంటి పజిళ్లు, బ్రెయిన్ టెస్టులు చేస్తూ ఉండటం వల్ల మెదడును పదును పెట్టుకోవచ్చు.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె 5 సెకన్లలో ఇందులో DOG ని గుర్తించండి చూద్దాం..!
Optical Illusion
Prashanthi V
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 28, 2025 | 12:34 PM

Share

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ లో మీరు “DOG” అనే పదాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కి మీకు కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇలాంటి పజిళ్లు మీ దృష్టి సామర్థ్యాన్ని, శీఘ్రంగా నమూనాలను గుర్తించే శక్తిని పరీక్షిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మన పరిశీలనా శక్తి మరింత మెరుగవుతుంది.

మీరు చూస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో “D”, “O”, “G” అనే అక్షరాలు కలిసిన గ్రిడ్ ఉంటుంది. అయితే అవి యాదృచ్ఛికంగా కూర్చబడి ఉంటాయి కాబట్టి “DOG” అనే పదాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది. అలా అని అందరికి కష్టంగా ఏం ఉండదు. తరచుగా ఆప్టికల్ ఇల్యూషన్ లలో పాల్గొనవారికి చాలా ఈజీగా ఉంటుంది. పాల్గొననివారికి కొంచం కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమైన సరే ఇష్టంగా ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. వెంటనే కనిపెట్టేస్తారు.

Optical Illusion

మరోసారి బాగా చూడండి. మీరు కేవలం 5 సెకన్లలో మాత్రమే ఈ పదాన్ని గుర్తించాలి. ఎక్కువ టైమ్ తీసుకోకండి. మీ మెదడుకు జాగ్రత్తగా వివరించండి. అప్పుడే సరైన సమాధానం ఎక్కడ ఉందో ఈజీగా చెప్పేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బ్రెయిన్ కి మెసేజ్ చేయండి. 5 సెకన్లలో సమాధానం కావాలని. పంపారా.. సమాధానం వచ్చిందా..? హో వస్తే మీకు అభినందనలు.

కొంతమంది కనిపెట్టలేకపోవచ్చు. అలాంటి వారు మరలా బాగా ఫోకస్ చేసి చూడండి. ఈసారి తప్పకుండా గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో సమాధానం మన కళ్ల ముందు ఉన్నా మన మనస్సు మోసగించి అది కనిపించనివిధంగా చేస్తుంది. 5 సెకన్లలో ఈ పదాన్ని కనుగొన్నవారికి అభినందనలు. మీరు గొప్ప దృష్టి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

ఇంకా వెతుకుతున్నవారు నిరాశ చెందవద్దు. డాగ్ ని నేనే వెతికిపెట్టాను. ఇక్కడే ఉంది చూసి తీసుకెళ్లండి. ఇలాంటి పజిళ్లను తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఆసక్తికరమైన టాస్క్ ను మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోండి.

Optical Illusion 1