Amazing Video: పాపం గున్న ఏనుగు దారి తప్పింది.. బావిలో పడింది.. బయటకు తీసిన తర్వాత ఏమైందంటే…

పాపం గున్న ఏనుగు దారి తప్పింది. దారి తప్పిన ఆ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. 15 అడుగుల లోతైన బావిలో అది పడిపోయింది. ఈ ఘటన ఒడిశా లోని మయూర్‌భంజ్‌లో జరిగింది. గున్న ఏనుగును రక్షించడానికి అటవీశాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు...

Amazing Video: పాపం గున్న ఏనుగు దారి తప్పింది.. బావిలో పడింది.. బయటకు తీసిన తర్వాత ఏమైందంటే...
Odisha Baby Elephant
Follow us

|

Updated on: Apr 11, 2021 | 2:47 PM

పాపం గున్న ఏనుగు దారి తప్పింది. దారి తప్పిన ఆ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. 15 అడుగుల లోతైన బావిలో అది పడిపోయింది. ఈ ఘటన ఒడిశా లోని మయూర్‌భంజ్‌లో జరిగింది. గున్న ఏనుగును రక్షించడానికి అటవీశాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సహాయాన్ని వాళ్లు తీసుకున్నారు. పాడుబడ్డ బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వారు అగ్నిమాపక సిబ్బంది. బుల్‌డోజర్‌ను కూడా తీసుకొచ్చారు. బుల్‌డోజర్‌ సాయంతో ఆ గున్న ఏనుగును బయటకు తీశారు. దానిని సమీపం లోని అటవీప్రాంతంలో వదిలేశారు.

బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఓ ఏనుగుల గుంపు ఒడిశా లోకి ప్రవేశించింది. ఆ గుంపులో భాగమైన గున్న ఏనుగు అనుకోకుండా బావిలో పడిపోయింది. తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఏనుగు చాలా ప్రయత్నించింది . కాని సాధ్యం కాలేదు. చాలా గంటల సేవు బావి దగ్గరే అది వేచి చూసింది. కాని లాభం లేకుండా పోయింది. చివరకు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తొలుత ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం లోకి తరిమేశారు. తరువాతే సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఆ సన్నటి 15 అడుగుల గొయ్యికి సమాంతరగం మరో గొయ్యిని తవ్వి అందులో నుంచి ఆ గున్న ఏనుగు బయటకు తీశారు. తీసిన తర్వాత అది చేసిన హడావిడితో ఫారెస్ట్ అధికారులు పరుగులు పెట్టారు. బావి నుంచి బయటపడ్డ గున్న ఏనుగును సురక్షితంగా దాని తల్లి దగ్గరకు చేర్చారు అటవీశాఖ అధికారులు.

ఫారెస్ట్‌ అధికారులు ఆరుగంటల పాటు శ్రమించి ఆ ఏనుగు పిల్లను బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గజరాజులు కూడా తమ పిల్లను కాపాడిన అటవీశాఖ , ఫైర్‌ సిబ్బందికి మనస్సు లోనే ధన్యవాదాలు చెప్పుకున్నాయి.

ఇవి కూడా చదవండి: Pawan Kalyan : వైద్యుల సూచనతో హోంఐసోలేషన్‌లోకి పవన్.. వర్చువల్‌గా పార్టీ కార్యకలాపాలు

Viral video: స్నేహమంటే ఇదేరా… మిత్రుడి కోసం మృగరాజునే ఎదిరించింది… ఎత్తిపడేసింది..

Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?