Anjeer Farming: అత్తి సాగుతో అద్భుత లాభాలు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..

Anjeer Farming: భారతదేశంతో సహా అమెరికా, ఆఫ్రికా ఇంకా అనేక దేశాల్లో అత్తి పండ్లను సాగు చేస్తారు. దీని పండ్లను తాజాగా ఉన్నప్పుడే

Anjeer Farming: అత్తి సాగుతో అద్భుత లాభాలు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..
Anjeer
Follow us

|

Updated on: Sep 17, 2021 | 10:27 PM

Anjeer Farming: భారతదేశంతో సహా అమెరికా, ఆఫ్రికా ఇంకా అనేక దేశాల్లో అత్తి పండ్లను సాగు చేస్తారు. దీని పండ్లను తాజాగా ఉన్నప్పుడే కాకుండా ఎండబెట్టి కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా వాతావరణం సమశీతోష్ణంగా, పొడిగా ఉండే ప్రదేశంలో అత్తి సాగు చేస్తారు. ఇండియా గురించి మాట్లాడితే ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో సాగు చేస్తారు. అత్తి మొక్కలు సుమారు రెండు సంవత్సరాల తరువాత దిగుబడిని ప్రారంభిస్తాయి. నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు గల మొక్క నుంచి దాదాపు 15 కిలోల పండ్లు లభిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పూర్తిగా పెరిగిన అత్తి మొక్క నుంచి ఒకేసారి రూ.12000 వరకు సంపాదించవచ్చు.

మహారాష్ట్రలో దీని సాగు అత్తి పండ్లను మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తున్నారు. మొత్తం 417 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇందులో 312 హెక్టార్లకు పైగా పూణే జిల్లాలోనే ఉంది. సతారా, పూణే జిల్లాల శివార్లలోని నీరా నది లోయలో ఖేడ్-శివ్రా నుంచి జెజూరి వరకు సాగు చేస్తున్నారు. ఇటీవల షోలాపూర్-ఉస్మానాబాద్‌లో రైతులు అత్తి పండ్లను పండించడం ప్రారంభించారు. అంజీర్ చాలా పోషకమైన పండు. ఇందులో 10 నుంచి 28 శాతం చక్కెర ఉంటుంది. నిమ్మ, ఐరన్‌, విటమిన్లు A, C ఎక్కువగా ఉంటాయి. అత్తి పండ్లను ఇతర పండ్ల కంటే విలువైనవిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది ఆస్తమాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ సీజన్‌లో అత్తి పండ్లను నాటాలి? అత్తి పండ్లు వేడి, పొడి వాతావరణాలను బాగా తట్టుకుంటాయి. ఈ కారణంగా ఈ పండును మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. ఈ పంటకు తక్కువ ఉష్ణోగ్రత హానికరం కాదు తేమతో కూడిన వాతావరణం సరిపోదు. అత్తి పండ్లను ముఖ్యంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెంచవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి వరకు చాలా అనుకూలమైన వాతావరణం. అత్తి పండ్లను నలుపు, ఎరుపు నేలలో పెంచవచ్చు. పెద్ద మొత్తంలో సున్నపురాయితో కూడిన నల్ల మట్టిలో అత్తి పండ్లను బాగా సాగు చేస్తారు.

IGNOU: MBA కోర్సును ప్రారంభించిన IGNOU.. ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోండి..

Fast Charging: ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్న ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా అవుతుందో తెలుసా?

Coronavirus: ఆ ఇంజక్షన్‌తో కరోనాను దూరం పెట్టొచ్చు.. కరోనా నిరోధించే మరో మార్గం కనిపెట్టిన పరిశోధకులు !