Vastu Tips: డస్ట్‌బిన్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?

ఇక చెత్త డబ్బా విషయంలో కూడా వాస్తును పాటించాలని పండితులు చెబుతున్నారు. చెత్తే కదా అని లైట్‌ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చెత్త డబ్బను ఏర్పాటు చేసుకునే విషయంలో మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు ఆర్థికంగా, మానసికంగా సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం చెత్త డబ్బ విషయంలో...

Vastu Tips: డస్ట్‌బిన్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
Vastu Dust Bin
Follow us

|

Updated on: Jul 09, 2024 | 1:26 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని. ఇంట్లో ఏర్పాటు చేసుకునే ప్రతీ వస్తువు విషయంలో ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ఇంటి నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, వస్తువుల విషయంలో కూడా అంతే ఇస్తుంటారు. టీవీ మొదలు బీరువా వరకు అన్నింటి విషయంలో వాస్తును తూచా తప్పకుండా పాటిస్తుంటారు.

ఇక చెత్త డబ్బా విషయంలో కూడా వాస్తును పాటించాలని పండితులు చెబుతున్నారు. చెత్తే కదా అని లైట్‌ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చెత్త డబ్బను ఏర్పాటు చేసుకునే విషయంలో మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు ఆర్థికంగా, మానసికంగా సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం చెత్త డబ్బ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎట్టి పరిస్థితుల్లో డస్ట్‌ బిన్‌ను ఈశాన్యం దిశలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యాన్ని దేవతల దిశగా భావిస్తారు. అలాంటి స్థానంలో చెత్త డబ్బను పెట్టకూడదని అంటారు. ఒకవేళ ఈ దిశలో చెత్త డబ్బాను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* ఇక ఇంట్లో చెత్త కుండీ ఉండకూడని మరో దిశ ఆగ్నేయం. ఈ దిశలో డస్ట్‌ బిన్‌ను పెడితే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవను హెచ్చరిస్తున్నారు. అప్పుల బాధ వేధిస్తుందని అంటున్నారు.

* నిపుణుల అభిప్రాయం ఇంటికి తూర్పు లేదా ఉత్తరం వైపు చెత్త కుండీలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఉత్తరం దిశలో ఉంచితే వృత్తి, ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

* వాస్తు పండిలు సూచన ప్రకారం చెత్త డబ్బాను నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంచాలని చెబుతున్నారు. నైరుతి దిశలో డస్ట్ బిన్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. డస్ట్‌బిన్‌ను వాయువ్య దిశలో ఉంచడం కూడా మంచిదేనని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..