AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఇకనుంచి అతి తక్కువ ధరలో ఏసీ ప్రయాణం

Railway Passengers : భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కోచ్లను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఇప్పుడు తక్కువ ధరతో ఏసీలో ప్రయాణించడానికి వీలుగా

Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఇకనుంచి అతి తక్కువ ధరలో ఏసీ ప్రయాణం
Railway Passengers
uppula Raju
|

Updated on: Jul 03, 2021 | 9:06 PM

Share

Railway Passengers : భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కోచ్లను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఇప్పుడు తక్కువ ధరతో ఏసీలో ప్రయాణించడానికి వీలుగా ఏసి 3 టైర్ కోచ్‌ను ఏర్పాటు చేస్తోంది. రైల్వే 806 ఎకానమీ ఏసీ 3 టైర్ కోచ్‌లను ఈ ఏడాది పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సరసమైన ఛార్జీల వద్ద ఏర్పాటు చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ కోచ్ ఫ్యాక్టరీలలో వీటిని సిద్ధం చేస్తోంది. బోగీలు రెడీ కావడంతో వాటిని ఎప్పటికప్పుడు రైళ్లకి అమర్చుతున్నారు.

రైల్వే బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిష్ట సంఖ్యలో బోగీలను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) తయారు చేస్తోంది. ఏసీ క్లాస్‌లో ప్రయాణీకులను తక్కువ ఛార్జీలకు ప్రయాణించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఇవన్నీ చేస్తోంది. ఇందుకోసం ఎసి 3 టైర్ కోచ్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ కోచ్‌లు సాధారణ ఎసి 3 టైర్ కోచ్‌ల మాదిరిగా ఉంటాయి. ఇప్పటికే కొన్ని బోగీలను తయారు చేసి రైలులో ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

ఈ రైళ్లను అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తారు ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 806 బోగీలను సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. యాంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) లో 344, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) లో 177, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసిఎఫ్) లో 285 బోగీలను తయారు చేస్తున్నారు. మార్చి 2021 నాటికి అన్ని బోగీలను రైళ్లలో అమర్చనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. ఇది కాకుండా బోర్డు ఆమోదం పొందిన తరువాత మరిన్ని ఎకానమీ ఏసి కోచ్‌లు తయారు చేస్తారు.

ఈ కోచ్‌లలో ప్రయాణం సాధారణ ఏసి 3 టైర్ కోచ్‌ల కంటే చౌకగా ఉంటుంది. రైల్వే అధికారుల ప్రకారం ఎకానమీ ఏసి కోచ్లలో బెర్తుల సంఖ్య ఎక్కువ. సాధారణ ఏసి 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉండగా ఇందులో మరో 11 అంటే 83 బెర్త్‌లు ఉంటాయి. ఇందుకోసం రైల్వే సీట్ల మధ్య అంతరాన్ని కొద్దిగా తగ్గించింది. అధికారులు చెప్పిన ప్రకారం అంతరం తగ్గడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురికారు. ఇది కాకుండా సైడ్ బెర్త్ పొడవు ఒకే విధంగా రూపొందించారు.

ఎకానమీ ఎసి 3 టైర్ కోచ్‌లో చదవడానికి వ్యక్తిగత కాంతి, ఏసి వెంట్స్, యుఎస్‌బి పాయింట్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఎగువ బెర్త్ ఎక్కడానికి మంచి నిచ్చెన, స్పెషల్ స్నాక్ టేబుల్ ఉన్నాయి. వీటితో పాటు, టాయిలెట్‌లో ఫుట్ ఆపరేటింగ్ ట్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) ఇప్పటికే 15 కోచ్‌ల మొదటి రేక్‌ను పంపింది. ఇప్పుడు దేశంలోని పేద విభాగం కూడా ఏసి కోచ్‌లో ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతుంది.

5 Ayurvedic Tips : పోస్ట్ కొవిడ్, డయాబెటీస్‌‌తో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఈ 5 ఆయుర్వేద పద్దతులను పాటించండి..

Jamun: నేరేడు పండ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఎక్కువగా తింటే అన్నే ఆరోగ్య సమస్యలూ.. అవేంటో తెలుసా!

Hyderabad Citizens : నగరవాసులు బోర్ నీరు తాగుతున్నారా..! అయితే చాలా డేంజర్.. ఈ విషయం తెలుసుకోండి లేదంటే