Benefits of Bottle Gourd Juice: యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి ఎఫెక్టివ్‌గా పని చేసే సొరకాయ జ్యూస్ ..

మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది...

Benefits of Bottle Gourd Juice: యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి ఎఫెక్టివ్‌గా పని చేసే సొరకాయ జ్యూస్ ..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 2:16 PM

Benefits of Lauki Juice: వేదకాలం నుంచి వాడుకలో ఉన్న సొరకాయ . ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. దీనిలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి విటమిన్స్, మినరల్స్ అథికంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ని పొందవచ్చు. అయితే ఈ సొరకాయని కూర, స్వీట్స్, వంటివి చేయడానికి ఉపయోగిస్తారు.. కానీ సొరకాయ జ్యూస్ తో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

సొరకాయ జ్యూస్‌ తయారీ..

అర గ్లాసు సొరకాయ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. ఈ రెండూ బాగా కలిపి తాగాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

1. ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. 2. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 3. జీర్ణక్రియ మెరుగుపడడానికి ఈ జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తిన్న ఆహారం మరింత శక్తి వంతంగా తేలికగా జీర్ణం కావడానికి బాగా సహాయపడుతుంది. 4. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది సొరకాయ. దీనిలో జింక్ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. 5. స్ట్రెస్‌, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది. 6. తీవ్రమైన అతిసార, మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. 7. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే యూరినరీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

Also Read: ప్రమాదంలో మరణించిన డైరెక్టర్‌ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్లు

Latest Articles