అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన యజమాని.. వారం రోజులపాటు అక్కడే నిరీక్షించిన పెంపుడు శునకం

మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ విషయంలో జంతువులు వంద రెట్లు మేలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు....

  • Ram Naramaneni
  • Publish Date - 1:23 pm, Sat, 23 January 21
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన యజమాని.. వారం రోజులపాటు అక్కడే నిరీక్షించిన పెంపుడు శునకం

మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ విషయంలో జంతువులు వంద రెట్లు మేలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందునా కుక్క చూపించే ప్రేమ, విశ్వాసం ఎవర్‌గ్రీన్. మనం ఏ సందర్భంలో ఉన్నా కుక్క తోడుంటుంది.  అవసరమైతే తన యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాయ్. ఇప్పటికే అటువంటి ఘటనలో ప్రపంచవ్యాప్తంగా అనేకం చూశాం. శునకాల ప్రేమ గొప్పతనాన్ని ఉదహరించే మరో సంఘటన తాజాగా టర్కీలో వెలుగుచూసింది.  తాతన యజమాని అనారోగ్యంతో చికిత్స తీసుకుంటే ఆయన కోలుకుని ఇంటికి వచ్చే వరకూ ఆస్పత్రి వద్దే ఉండిపోయింది ఓ పెంపుడు శునకం. యజమాని ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తీసుకొచ్చినా.. అక్కడ ఎక్కువసేపు ఉండకుండా తిరిగి ఆస్పత్రికే వచ్చేది. యజమాని బయటకు వస్తాడేమ్ అని ఆస్పత్రి ముందు వేయి కళ్లతో ఎదురుచూసేది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. ట్రాబ్‌జోన్ ప్రాంతానికి చెందిన సెమల్ సెంటర్క్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలను బోన్కుక్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. దానిని ఆయనపై ఎంతో ముద్దుగా చూసుకునేవారు. అది కూడా యజమాని పట్ల ఎంతో గౌరవంతో, విశ్వాసంతో ఉండేది. ఈ నేపథ్యంలో సెమల్ జనవరి 14న అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దీనిని గమనించిన బోన్కుక్ ఆ అంబులెన్స్‌ వెంట ఆస్పత్రి వరకు ఆగకుండా పరిగెత్తింది.

ఆ రోజంతా అక్కడే వెయిట్ చేసిన సెమల్‌ కుతురు ఐనూర్ ఎగెలి రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అయితే తరువాతి రోజు ఉదయమే తిరిగి ఆసుపత్రి వచ్చింది. ఇలా వారం రోజుల పాటు ఆ పెంపుడు శునకం ఆసుపత్రి వద్ద యజమాని రాక కోసం పడిగాపులు కాసింది. జనవరి 20న కోలుకున్న సెమల్.. వీల్‌చైర్‌లో ఆసుపత్రి గేటు వద్దకు వచ్చి తన కుక్కను చూసి చలించిపోయారు. ప్రేమ, విశ్వాసం అంటే ఇదే కదా.. మీరేమంటారు చెప్పండి.

Also Read:

Godman kidnap: సినీ ఫక్కీలో స్వామీజీ కిడ్నాప్.. సినిమాకు మించిన ట్విస్ట్‌లు.. చివరకు ఏం జరిగిందంటే..? 

కిస్తీ కట్టాలంటూ ఫైనాన్స్‌ కంపెనీ వరుస ఫోన్ కాల్స్.. టార్చర్ తట్టుకోలేక ఆటోని తగలబెట్టిన వ్యక్తి