Viral: కోటలో అభివృద్ధి పనులు చేస్తుండగా.. బయటపడ్డ చిన్న చిన్న గుండ్లు.. అవేంటో తెల్సా..?
గండుగలి కుమారరామ కోటలో హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ అభివృద్ధి పనులు చేయిస్తుండగా.. చిన్న, చిన్న గుండ్లు బయటపడ్డాయి. ప్రాథమికంగా అవేంటో నిర్ధారించారు అధికారులు.
Ballari district: బళ్లారి జిల్లాలోని కంప్లి సమీపంలోని గండుగలి కుమారరామ కోట(Gandugali Kumararama fort)లో అభివృద్ధి పనులు చేస్తుండగా సుమారు 39 చిన్న ఫిరంగి గుండ్లు(cannon balls) బయటపడ్డాయి. విజయనగర్ జిల్లా హంపి సమీపంలోని కమలాపూర్ పురావస్తు మ్యూజియం మరియు హెరిటేజ్ డిపార్ట్‌మెంట్(DAMH) సిబ్బంది కోట ప్రవేశద్వారం వద్ద ఈ ఫిరంగి బంతులను వెలికితీశారు. ప్రతి చిన్న ఫిరంగి బంతి దాదాపు 150 గ్రాముల బరువు ఉంది. కోట టెర్రస్ దగ్గర అవి బయటపడ్డాయని అని DAMH ఆర్కియాలజికల్ అసిస్టెంట్ డాక్టర్ ఆర్ మనజానాయక్ తెలిపారు. ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. శత్రువుల బారి నుంచి రక్షణ కోసం.. వారికి అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ఫిరంగులను ఏర్పాటు చేస్తుండేవారు. కోట పైనుంచి ఫిరంగి ద్వారా ఈ బంతులను కాల్చేవారని తెలుస్తోంది. ఇవి విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినవని అంచనా వేస్తున్నారు. అయితే, వాటి ఖచ్చితమైన కాలాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. కాగా అక్టోబర్ 10, 2018న గంగావతి తాలూకాలోని అనెగుండి గ్రామంలో పరిరక్షణ పనులు చేస్తుండగా సుమారు 174 ఫిరంగి గుండ్లు దొరికాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి