Health Tips: మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా?.. బీ అలర్ట్.. ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..

Health Tips: కరోనా మహమ్మారి ప్రజలందరి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపింది. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి జీవన శైలి కారణంగా..

Health Tips: మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా?.. బీ అలర్ట్.. ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..
Health
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2021 | 7:17 AM

Health Tips: కరోనా మహమ్మారి ప్రజలందరి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపింది. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి జీవన శైలి కారణంగా.. అనేక వ్యాధులు బారినపడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా సమయానికి తినకపోవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అసాధారణ జీవన శైలి కారణంగా.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ లక్షణాలు కనిపిస్తాయి కూడా. అయితే, చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. అదే వారు చెసే పెద్ద తప్పు అవుతుంది. ఆ స్వల్ప లక్షణాలే.. పెద్ద వ్యాధిగా పరిణమిస్తాయి. ఆ తరువాత డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే.. ముందే తేరుకుంటే.. ఎలాంటి ఉపద్రవం రాకుండా అడ్డుకోవచ్చు. సాధారణంగా చాలా మందికి కూర్చున్నప్పుడు.. చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఇలా జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మరి ఆ తిమ్మిర్లు రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డయాబెటిస్ కారణంగా కూడా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. అందుకే, ఈ తిమ్మిర్ల సమస్య తరచుగా ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి. 2. చాలా మంది రాత్రిపూట ఒకే స్థితిలో ఎక్కువసేపు నిద్రపోతుంటారు. దాని కారణంగా కాళ్లు, చేతులు తిమ్మిర్లు, జలదరింపు వచ్చినట్లు అవుతుంది. తిమ్మిరి ఉన్న ప్రదేశంలో కాసేపు మసాజ్ చేయడం ద్వారా తగ్గుతుంది. అయితే, ఇలా నిత్యం జరుగుతుండటం, చేతులు మొద్దుబారినట్లు అనిపిస్తే మాత్రం ప్రమాదం పొంచిఉన్నట్లే చెప్పాలి. రక్త ప్రసరణ లేకపోవడం వలన కూడా చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, జలదరింపు వస్తుంటుంది. 3. ఇంకా సరిగా కూర్చోపోవడం వల్ల వెన్నుపాము చుట్టూ నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయ సమస్యలు మొదలవుతాయి. ఈ కారణంగానూ చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తాయి. అయితే, ఈ సమయంలో వైద్యుడిని సంప్రదించడం మేలు. లేదంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. 4. థైరాయిడ్ గ్రంథుల్లో ఇబ్బందుల వలన కూడా చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఒకరకమైన షాక్ వచ్చినట్లు అనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. 5. నేటి కాలంలో.. చాలా మంది రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేస్తుంటారు. దీని కారణంగా.. మణికట్టు నరాలపై దుష్ప్రభావం ఉంటుంది. ఫలితంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణం చేతులు తిమ్మిర్లు రావడం. ఇదే పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also read:

Poison Expiry Date: విషానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..