Women Health: ప్రతి స్త్రీ సాధన చేయాల్సిన అత్యంత కీలకమైన యోగా ‘ముద్ర’.. అద్భుతమైన శక్తి జనిస్తుంది..!
స్త్రీ శరీర నిర్మాణం.. పురుషుల శరీర నిర్మాణానికి భిన్నంగా ఉంటుంది. పునరుత్పత్తి వ్యవస్థ మాత్రమే కాకుండా.. ఇతర అనేక అంశాల్లోనూ వారి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. అయితే, చెడు జీవనశైలి, అవాంఛిత ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడితో కూడిన జీవితం వారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది.

స్త్రీ శరీర నిర్మాణం.. పురుషుల శరీర నిర్మాణానికి భిన్నంగా ఉంటుంది. పునరుత్పత్తి వ్యవస్థ మాత్రమే కాకుండా.. ఇతర అనేక అంశాల్లోనూ వారి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. అయితే, చెడు జీవనశైలి, అవాంఛిత ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడితో కూడిన జీవితం వారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది. అయితే, దైనందిన జీవితంలో ఉరుకులు, పరుగులు తప్పవు. అయినప్పటికీ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు ఉత్తమ మార్గం యోగాభ్యాసం. ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది.
మహిళ శరీరంలో కొత్త శక్తి సృష్టించడానికి సహాయపడే యోగా భంగిమలను యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ యోగా ఆసనాలుు చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ప్రభావంతో యువతులు, మహిళలు గర్భాశయ నొప్పి, ఫైబ్రాయిడ్స్, యూటీఐ ఇన్‌ఫెక్షన్స్, పాలిప్స్, ప్రోలాప్స్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ యోగా బెస్ట్ సొల్యూషన్ చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శక్తి ముద్ర మహిళల్లో శక్తిని నింపుతుందని, శక్తి ముద్రను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
శక్తి ముద్ర వల్ల కలిగే ప్రయోజనాలు..
శక్తి ముద్ర అనేది శరీరంలో శ్వాసక్రియను, శక్తిని ప్రసరింపజేసే శక్తివంతమైన చేతి నిర్మాణ ముద్ర. ఈ ముద్ర శక్తి దుర్గ లేదా స్త్రీ శక్తిని కూడా సూచిస్తుంది.




ఈ ముద్ర ఎలా చేయాలి?
బొటనవేళ్లను మొదటి రెండు వేళ్లతో అంటే చూపుడు, మధ్య వేలితో చుట్టి, చివరి రెండు వేళ్లను అంటే ఉంగరపు వేలు, చిటికెన వేళ్లను కలపాలి. దీనినే శక్తి ముద్ర అంటారు. ఇప్పుడు మీ చేతులను ఛాతీ స్థాయిలో లేదా నాభి మధ్యలో ఉంచాలి. లోతైన శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఇలా రోజూ 5 నుంచి 10 నిమిషాల పాటు చేయడం వల్ల స్త్రీల శరీరంలో కొత్త శక్తి ఏర్పడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..