AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miscarriage: కాబోయే అమ్మలు జాగ్రత్త.. ఈ 5 కారణాల వల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు..! ఏంటో తెలుసుకోండి..

Miscarriage: తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది. ఈ సృష్టి ముందుకు సాగాలంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాల్సిందే. ఇలా జీవితంలో

Miscarriage: కాబోయే అమ్మలు జాగ్రత్త.. ఈ 5 కారణాల వల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు..! ఏంటో తెలుసుకోండి..
Miscarriage
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 21, 2021 | 6:42 AM

Share

Miscarriage: తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది. ఈ సృష్టి ముందుకు సాగాలంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాల్సిందే. ఇలా జీవితంలో కీలకమైన ఈ దశను మహిళలు సంతోషంగా ఆహ్వానిస్తారు. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఎంతో ఇబ్బంది ఎదురయినప్పటికీ తమ ప్రతీరూపాన్ని చూసుకోవడానికి సంతోషంగా భరిస్తారు. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే కాబోయే తల్లులు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

1. థైరాయిడ్: ఈ రోజుల్లో థైరాయిడ్ చాలా సాధారణ సమస్య. ఈ సమస్యతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతారు. అయితే గర్భధారణ సమయంలో మీకు థైరాయిడ్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది హార్మోన్ సంబంధిత సమస్య. అందుకే గర్భధారణలో సమయంలో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం మంచిది. ఎందుకంటే ఇది కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం అవుతుంది.

2. మధుమేహం: చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటీస్‌కి గురవుతారు. అందుకే ఎప్పటికప్పుడు నిపుణులచే పరీక్ష చేసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ కొన్నిసార్లు ప్రారంభ నెలల్లో గర్భస్రావానికి దారితీస్తుంది. ఇది కాకుండా దీని కారణంగా పిల్లలలో రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

3. క్రోమోజోముల్ అసాధారణత: ఫలదీకరణ సమయంలో స్పెర్మ్, అండం రెండూ 23 క్రోమోజోమ్‌లను సమీకరించి మ్యాచ్‌ని ఏర్పరుస్తాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఏదైనా లోపం జరిగితే క్రోమోజోమ్ అసాధారణతలకు కారణమవుతుంది ఇది గర్భస్రావానికి దారితీస్తుంది.

4. హార్మోన్ల అసమతుల్యత: ఒక మహిళకు ఇప్పటికే హార్మోన్ల సమస్య ఉంటే లేదా ఆమె శరీరం తగినంత ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను తయారు చేయకపోతే సమస్య ఏర్పడుతుంది. అప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమస్యను సకాలంలో అర్థం చేసుకుంటే పరిస్థితిని మందులతో నియంత్రించవచ్చు.

5. ఫైబ్రాయిడ్స్ : గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గర్భాశయ లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం అవుతాయి. అలాంటి ఏదైనా సమస్య ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భస్రావం వంటి సమస్యను నివారించడానికి వైద్య నిపుణుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలి.

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..

Facebook: ఫేస్‌బుక్‌లో అత్యధిక వ్యూస్‌ పొందిన పోస్ట్‌ ఏంటో తెలుసా..! మన ఇండియాదే..