Turmeric: పసుపు వాడకపోతే శరీరంలో ఈ 4 పనులు జరగవు..! ఏంటో తెలుసుకోండి..

Turmeric: పసుపు వాడకపోతే శరీరంలో ఈ 4 పనులు జరగవు..! ఏంటో తెలుసుకోండి..
Turmeric

Turmeric Health Benefits : భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును గుర్తించారు

uppula Raju

| Edited By: Ravi Kiran

Aug 21, 2021 | 6:42 AM

Turmeric Health Benefits : భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును గుర్తించారు ఆయుర్వేద నిపుణులు.. ఎన్నో ఏళ్ల నుంచి సనాతన ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా వాడుతున్నారు. ఎన్నో రోగాలకు మంచి మందుగా పనిచేస్తుంది. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపుని ఆయుర్వేదంలో, సంప్రదాయ చైనీస్ ఔషధంలో, సిద్ధ ఔషధం, యునానిలో కూడా వాడతారు. అయితే తాజాగా పసుపు డయాబెటీస్‌పై చక్కటి ప్రభావం చూపిస్తుందని తేలింది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందని గుర్తించారు.

1. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పసుపును చాలా సంవత్సరాలుగా ఔషధంగా వాడుతున్నారు. అంతేకాకుండా ఆహారానికి రుచిని అందించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

2. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కరోనావైరస్ మహమ్మారి వల్ల అందరు ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. జలుబు, ఫ్లూ అనేది వాతావరణంలో మార్పుతో సులభంగా వచ్చే వ్యాధులు. వీటికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ వ్యాధిని నివారించడానికి పసుపు టీ లేదా పసుపు పాలను క్రమం తప్పకుండా తాగడం ప్రయోజనకరం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

3. సాధారణ వ్యాధులను దూరం పసుపులో ఉండే కర్కుమిన్ మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. కర్కుమిన్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుందని అనేక అధ్యయనాలలో తేలింది. కర్కుమిన్ క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మెటాస్టాసిస్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, టైప్ -2 డయాబెటిస్‌ను తగ్గించడంలో కర్కుమిన్ తోడ్పడుతుంది.

4. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది నేటి బిజీ జీవనశైలి కారణంగా చాలామంది చిన్న చిన్ విషయాలకు ఒత్తిడికి గురవుతున్నారు. మానసింకంగా ఎంతో బాధపడుతున్నారు. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. ఇది శరీరంలో యాంటీ డ్రిప్‌గా పనిచేస్తుంది.

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..

Facebook: ఫేస్‌బుక్‌లో అత్యధిక వ్యూస్‌ పొందిన పోస్ట్‌ ఏంటో తెలుసా..! మన ఇండియాదే..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu