AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆహార పదార్థాలను తినండి.. !

Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం ఫైబర్ ఫుడ్ చాలా ముఖ్యం. ఫైబర్ ఉండే ఆహారం జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Health Tips: వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆహార పదార్థాలను తినండి.. !
Fiber
Shiva Prajapati
|

Updated on: Aug 21, 2021 | 9:33 AM

Share

Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం ఫైబర్ ఫుడ్ చాలా ముఖ్యం. ఫైబర్ ఉండే ఆహారం జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఫైబర్ ఫుడ్ తినడం వలన జీర్ణ ప్రక్రియకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు.. పీచు పదార్థాలు అధిక బరువు తగ్గానికి సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఫైబర్ ఫుడ్ తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు: అరటిపండులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటి పండులో పొటాషియం, ఐరన్ మూలకాలు అధికంగా ఉంటాయి. అరటి పండు, ఓట్స్‌తో జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు.

వోట్స్: ఫైబర్ ఫుడ్‌లలో వోట్స్ కీలకం అని చెప్పాలి. ఓట్స్‌ని వివిధ రకాలుగా వండుకుని తిన్చొచ్చు. ఉప్మా నుంచి ఓట్స్ గ్రానోలా బార్‌ల వరకు వివిధ రకాలుగా చేసుకుని ఆరగించొచ్చు. ముఖ్యంగా ఓట్స్‌తో చేసిన ఆహారాన్ని ఉదయం సమయంలో తినడం ఉత్తమం. ఓట్స్ తినడం ద్వారా శరీరంలో కేలరీలు తగ్గి.. అధిక బరువును నియంత్రించొచ్చు.

పప్పు ధాన్యాలు:

ప్రోటీన్స్‌కు అడ్డా పప్పు ధాన్యాలు. వీటిల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే కార్పోహైడ్రేట్స్‌తో పాటు డైటరీ ఫైబర్ శరీరంలో శక్తిని పెంచుతుంది. రోజంతా మనస్సు, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.

అవిసె గింజలు: అవిసెల్లో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యూలర్ డైట్‌లో అవిసె గింజలను చేరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని రైతాలో కూడా కలిపి తీసుకోవచ్చు.

యాపిల్స్, పియర్స్:

యాపిల్స్, పియర్స్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తొక్కతో సహా తినాలి. ఆ తొక్కలోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. సలాడ్‌లో వీటిని కలిపి తినొచ్చు.

బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని వండుకుని తినాలి. పరోటా, చపాతీ, ఇతర ఫుడ్‌తో కలిపి తినొచ్చు. దీనిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతోంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు.

డ్రై ఫ్రూట్స్: వాల్ నట్స్, బాదం, జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని రాత్రి నానబెట్టి.. ఉదయం లేవగానే తినాలి. ఇలా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. ఫ్రూట్ మిక్స్, మిల్క్ షేక్ వంటి వాటిల్లో కూడా ఈ డ్రై ఫ్రూట్స్‌ని కలిపి ఆరగించొచ్చు.

Also read:

Peral Farming: భిన్నంగా ఆలోచించాడు.. ముత్యాల సాగు చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నాడు.. మరోవైపు శిక్షణ ఇస్తున్నాడు

రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. అంతలోనే ఇలా.. అలర్ట్ అయ్యిన తోటి ప్రయాణికులు..:Viral video.

Andhra Pradesh: నకిలీ చలాన్ల పై సీఎం సీరియస్.. ఇంత జరుగుతుందటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు..