AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Left Side Sleeping: మీరు ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు.. ఎడమవైపు తిరిగి నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Left Side Sleeping: మన పూర్వీకులు పెట్టిన నియమాలు, సాంప్రదాయాలు నేటి తరానికి చాదస్తంగా కనిపించవచ్చు.. కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందని..

Left Side Sleeping: మీరు ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు.. ఎడమవైపు తిరిగి నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
Left Side Of Sleeping
Surya Kala
|

Updated on: Aug 07, 2021 | 1:30 PM

Share

Left Side Sleeping: మన పూర్వీకులు పెట్టిన నియమాలు, సాంప్రదాయాలు నేటి తరానికి చాదస్తంగా కనిపించవచ్చు.. కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందని ఇప్పటికే అనేక విషయాల్లో రుజువైన సంగతి తెలిసిందే. ఇక ఆహారం తినే విషయంలోనే కాదు..శరీరానికి విశ్రాంతినిస్తూ నిద్ర పోయే విషయంలో కూడా మన పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు. తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలని కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని చెప్పారు.. అంతేకాని.. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. ఇక కుడివైపు నిద్రపోవడం మంచిది కాదని.. ఎడవైపు మాత్రమే నిద్రపోవాలని కూడా చెప్పారు. ఈరోజు ఎడమవైపు తిరిగి నిద్రపోవడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

భోజనం చేసిన అనంతరం జీర్ణం చెయ్యటానికి జఠరాగ్ని యాక్టివేట్ అవుతుంది. మెదట మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువలన నిద్ర వస్తుంది. తగినంత నిద్ర విశ్రాంతి శరీరానికి మంచిది. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. ఇక రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన అనంతరం నిద్రపోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

పడుకునే విధానం: 

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి తలకిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి . ఇలా నిద్రపోవడాన్ని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు. ఎవరైనా అలసటకు గురైనప్పుడు ఇలా ఎడమ వైపున తిరిగి పడుకుంటే అలసట తొలగి పోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు.

ప్రయోజనాలు:

*గురక తగ్గుతుంది *గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండానికి, మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . *వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. *భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది . * వీపు , మెడ నొప్పులున్నవారికీ ఉపశమనం ఇస్తుంది. * శరీరంలో వున్న విష, వ్యర్ధ పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది . * కాలేయం, మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి . *జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది *గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేస్తుంది *గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి . *ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు . * కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి . *మెదడు చురుకుగా పని చేస్తుంది . * అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతని ఆయుర్వేద వైద్యులు చెప్పారు. ఎడమ వైపు తిరిగి పడుకొన్న తర్వాత మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చునని అన్నారు.

Also Read: Aditi Ashok: పతకం సాధింకపోతేనేమి.. చరిత్ర సృష్టించావంటూ అదితి అద్భుత ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్‌ (photo gallery)