పరేషాన్ తో ఉన్నోళ్లకు ఈ టిప్స్ కచ్చితంగా పనికొస్తాయి..! తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదో తెలుసా..?
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి అనారోగ్యానికి దారితీయవచ్చు. శాస్త్రీయంగా దీనికి ఉన్న కారణాలు, నిపుణుల సూచనలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటు మార్చాల్సిందే.

మనకు చాలా మామూలుగా ఉండే అలవాట్లలో తిన్న వెంటనే స్నానం చేయడం ఒకటి. ఉదయాన్నే లేచి అలసటగా ఉంటే.. చాలా మంది ముందుగా టిఫిన్ చేసేసి తర్వాత స్నానానికి వెళ్తారు. కానీ ఈ అలవాటు వల్ల మన శరీరానికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. తిన్న తర్వాత జీర్ణక్రియ జరిగే సమయంలో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ సమయంలో స్నానం చేస్తే జీర్ణక్రియకు అడ్డు వస్తుందని చెబుతున్నారు.
ఎందుకు చేయకూడదు..?
తినగానే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. మనం తిన్న వెంటనే.. ఆహారం జీర్ణం కావడానికి మన శరీరం పొట్ట వైపు ఎక్కువ రక్తాన్ని పంపిస్తుంది. అదే సమయంలో స్నానం చేస్తే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాంతో ఆ రక్తం జీర్ణక్రియకు కాకుండా చర్మానికి ప్రసరిస్తుంది. ఈ మార్పు వల్ల జీర్ణశక్తి తగ్గిపోయి అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.
నిపుణుల సలహా ఏంటి..?
నిపుణుల సలహా ప్రకారం.. భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం 90 నుంచి 120 నిమిషాల వరకు ఆగి తర్వాతే స్నానం చేయడం మంచిది. లేదంటే భోజనానికి ముందే స్నానం చేయడం ఆరోగ్యానికి ఉత్తమం. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు. మలబద్ధకం లేదా అజీర్ణం సమస్యలు ఉన్నవారు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సబ్బుల వాడకం.. కొంతమంది ఎక్కువ నురుగు వచ్చే సబ్బులను వాడుతుంటారు. అలాంటి సబ్బులలో ఉండే రసాయనాలు, సువాసనలు చర్మాన్ని పొడిగా మార్చవచ్చు. దీని వల్ల చర్మం తేమ కోల్పోయి, చర్మ సమస్యలు వస్తాయి. సహజ సబ్బులు.. సున్నితమైన చర్మం ఉన్నవారు (ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు) సహజ పదార్థాలతో తయారైన సబ్బులను వాడటం మంచిది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోజువారీ అలవాట్లలో మనం చేసే ఈ చిన్న పొరపాట్లే చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మనం ఈ శాస్త్రీయ కారణాలను తెలుసుకుని మన జీవనశైలిని మార్చుకుంటే.. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ నియమాన్ని పాటిస్తే మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.




