AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ అల్లం తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

వంటగదిలో సులభంగా లభించే అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? అల్లం ఆహారం రుచిని, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఒక వరం అని చెప్పవచ్చు. రోజూ అల్లం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజూ అల్లం తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
Ginger Health Benefits
Prashanthi V
| Edited By: |

Updated on: Feb 15, 2025 | 8:20 AM

Share

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను నమిలి తినవచ్చు. ఇది కుదరకపోతే ఉదయం ఖాళీ కడుపుతో అల్లం వేసి మరిగించిన నీటిని తాగవచ్చు. ఇది మీ శరీరానికి ఊహించని అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ

ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తింటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అల్లం తింటే ఆహారం సులభంగా జీర్ణమయ్యి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

అధిక బరువు

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి అల్లం సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి కూడా అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డయాబెటిక్

డయాబెటిక్ రోగులకు కూడా అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

శరీరాన్ని శుభ్రపరుస్తుంది

అల్లం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగడానికి ఉత్తమమైన డిటాక్స్ పానీయంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తి

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తింటే వ్యాధులతో పోరాడటానికి శరీరం బలంగా మారుతుంది.

చర్మానికి మంచిది

అల్లం చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

జుట్టుకు మంచిది

అల్లం జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును బలమైనదిగా, ఒత్తుగా ఉంచడంలో సహాయపడుతుంది. అల్లంలోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

అల్లం ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)