Guava Health Benefits: ఒక్క జామ పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! డోంట్ మిస్..!
మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే పండ్లలో జామపండ్లు ఒకటి. ఈ రుచికరమైన జామ పండ్లను మీ ఫుడ్ డైట్ లో చేర్చడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జామ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది శరీరానికి ఉన్న రక్షణ శక్తిని పెంచుతుంది. ఆరెంజ్ లోని విటమిన్ సి కంటే జామలో నాలుగురెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే జామ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించే ఉత్తమమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటిగా ఉంది.
ఫైబర్ ప్రయోజనాలు
జామ పండ్లలో ఉన్న ఫైబర్ మంచి జీర్ణ సంబంధ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదనంగా జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. దీనితో పాటు ఇది షుగర్ ఉన్నవారికి మంచి పండు.
విటమిన్ ఎ
జామ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే కంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గే సమస్యను నివారించేందుకు జామ జ్యూస్ తాగడం ఉపయోగకరంగా ఉంటుంది.
జుట్టు, చర్మానికి లాభాలు
జామలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జామలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి రోజూ ఒక జామ పండు తింటే సరిపోతుంది. ఒక జామ పండులో, ఒక అరటిపండులో సమానమైన పొటాషియం ఉంటుంది.
మాంగనీస్ ప్రయోజనాలు
జామలో సమృద్ధిగా ఉండే మాంగనీస్, ఆహారం నుంచి ఇతర ముఖ్యమైన పోషకాలను శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడుతుంది. జామలో ఉండే మరో ముఖ్యమైన ప్రయోజనం ఫోలేట్ అనే ఖనిజం గర్భధారణకు సహాయపడుతుంది. 100 గ్రాముల జామ పండులో 68 కేలరీలు, 8.92 గ్రాముల చక్కర మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లను తగిన పరిమాణంలోనే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




