Mushroom Allergy: పుట్టగొడుగుల వల్ల అలర్జీలు ఎందుకు వస్తాయి? ఎవరు తినకూడదు తెలుసా?
Mushroom Allergy: కొంతమందికి పుట్టగొడుగుల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ముందుగా ఉన్న ఆహారం లేదా పుప్పొడి అలెర్జీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Mushroom side effects: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయని అందరూ అనుకుంటారు. అందుకే చాలా మంది ఎక్కువ ధర ఉన్నప్పటికీ వారంలో ఒకసారి తినేందుకు ప్రయత్నిస్తుంటారు. రుచితోపాటు అనేక రకాలైన ప్రోటీన్లు, విటమిన్లు కలిగి ఉన్న పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. పుట్టగొడుగు సూప్, స్టైర్ ఫ్రై, పిజ్జా లేదా సలాడ్ అంటూ ఇలా వివిధ రూపాల్లో వండేసి తినేస్తుంటారు. అయితే, కొందరికి మాత్రం పుట్టగొడుగులు అంటే పడదు. తమకు ఎలర్జీ ఉందంటూ వారి పుట్టగొడుగులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంత ఆరోగ్యకరమైన పుట్టగొడుగులు వారికి ఎందుకు అలెర్జీని కలిగిస్తున్నాయి? వారు వాటికి దూరంగా ఉండాలా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, కొంతమందికి పుట్టగొడుగుల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ముందుగా ఉన్న ఆహారం లేదా పుప్పొడి అలెర్జీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
పుట్టగొడుగులు అలెర్జీని ఎందుకు కలిగిస్తాయి?
NCIB పరిశోధన ప్రకారం.. పుట్టగొడుగులలో కనిపించే ప్రోటీన్లు బూజు అలెర్జీ కారకాలతో పరస్పర చర్య చెందుతాయి. దీని వల్ల కొంతమంది సున్నితమైన వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలు సంభవిస్తాయి. సున్నితమైనవారు పుట్టగొడుగులు తిన్నప్పుడు.. వారి రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్లను హానికరమైన పదార్థాలుగా తప్పుగా భావించి అలెర్జీ ప్రతిచర్యను ప్రేరేపిస్తాయి. దీంతో హిస్టామిన్, ఇతర రసాయనాలను విడుదల చేస్తుంది. దీని వల్ల దురద, చర్మంపై దద్దుర్లు, వాపు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.
ఏ పుట్టగొడుగులు ఎక్కువ హాని చేస్తాయి?
పండించిన పుట్టగొడుగులతోపాటు అడవి పుట్టగొడుగులు కూడా అలెర్జీని కలిగించే ప్రోటీన్లు కలిగి ఉంటాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. కానీ, అడవి పుట్టగొడుగులు తరచుగా అధిక మొత్తంలో ఉంటాయి. ఇంకా కొంతమందిలో క్రాస్-అలెర్జీలు వస్తాయి. పుప్పొడి అలెర్జీల చరిత్ర ఉన్నవారికి పుట్టగొడుగు అలెర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
పుట్టగొడుగులకు ఎవరు దూరంగా ఉండాలి..?
అలెర్జీలు ఉన్నవారు.. పుట్టగొడుగులు లేదా ఇతర శిలీంధ్ర ఉత్పత్తులకు అలెర్జీల చరిత్ర ఉన్నవారు వాటిని తినకుండా ఉండాలి. అలెర్జీ ప్రతిచర్యలు చర్మపు దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు.. మధుమేహం లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో, పుట్టగొడుగులలో ఉండే ఫంగల్ ప్రోటీన్లు ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ ప్రతిచర్యలను పెంచుతాయి.
జీర్ణ సమస్యలు ఉన్నవారు.. మలబద్ధకం, గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
గర్భిణీలు లేదా పాలిచ్చే స్త్రీలు.. గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే సమయంలో కూడా పుట్టగొడుగులను తినడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
