AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఈ తెల్లటి రసం తాగి చూడండి.. మస్తు ఎనర్జీతో ఉల్లాసంగా ఉంటారు..!

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు తెల్ల గుమ్మడికాయ రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఉదయాన్నే కాఫీ, టీ తాగుతారు. వాటికి బదులు ఈ సహజ రసం తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

ఉదయాన్నే ఈ తెల్లటి రసం తాగి చూడండి.. మస్తు ఎనర్జీతో ఉల్లాసంగా ఉంటారు..!
Ash Gourd Juice Benefits
Prashanthi V
|

Updated on: Jun 22, 2025 | 8:34 PM

Share

తెల్ల గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి నరాలకు శక్తిని ఇస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతాయి. దాంతో ఉదయాన్నే ఈ రసం తాగితే ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రసం మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. మూత్రంలో వచ్చే ఇన్‌ ఫెక్షన్లు, మూత్రంలో రక్తం రావడం, పైల్స్ వల్ల రక్తం పోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల గుమ్మడికాయ రసం చల్లగా ఉంటుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

అల్సర్‌ తో బాధపడేవారు తెల్ల గుమ్మడికాయ రసాన్ని తేనెతో కలిపి ఉదయం తాగితే కడుపు లోపల గాయాలు త్వరగా తగ్గుతాయి. కడుపులోని పురుగులను బయటకు పంపిస్తుంది. కొత్త ఇన్‌ ఫెక్షన్లు రాకుండా ఆపుతుంది.

బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం ఈ రసం తాగడం వల్ల శరీరంలోని అదనపు నీరు బయటకు పోతుంది. ఇది బరువు తగ్గించడమే కాకుండా.. శరీరాన్ని తేలికగా, శక్తివంతంగా ఉంచుతుంది.

శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. ఈ రసం తాగితే శరీరం చల్లబడుతుంది. తేమగా మారుతుంది. వేసవిలో వేడి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి పరిష్కారం.

తెల్ల గుమ్మడికాయ రసాన్ని తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే రక్తం శుభ్రపడుతుంది. ఇది శరీరం లోపల అవయవాలకు సాయపడుతుంది. రక్తం కారడాన్ని నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది.

ఈ గుమ్మడికాయలో విటమిన్ బి, సి, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్, ఐరన్, నీరు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు.

ప్రతి ఉదయం ఒక గ్లాసు తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగడం మన శరీరానికి, మనసుకు చాలా మంచిది. ఇది ఒక చిన్న అలవాటు. కానీ దీని వల్ల చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)