AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీట్‌ రూట్‌ తో బ్యూటీ టిప్స్ మీకోసం..! మొటిమలు, మచ్చలకు సూపర్ సొల్యూషన్..!

సహజ పద్ధతులతో అందంగా కనిపించాలని కోరుకునే వారికి బీట్‌ రూట్ మంచి పరిష్కారం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మాన్ని సహజంగా మెరిపిస్తుంది. చర్మ సంరక్షణలో బీట్‌ రూట్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బీట్‌ రూట్‌ లో విటమిన్ సి, విటమిన్ బి9, ఐరన్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బీట్‌ రూట్ చాలా ముఖ్యమైనది.

బీట్‌ రూట్‌ తో బ్యూటీ టిప్స్ మీకోసం..! మొటిమలు, మచ్చలకు సూపర్ సొల్యూషన్..!
అనంతరం ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. అరగంట సేపు ఉంచుకుని తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఒక టీస్పూన్ తమలపాకు పొడి, రెండు టీస్పూన్ల పచ్చి పాలు, అర టీస్పూన్ బాదం నూనె బీట్‌రూట్‌ పేస్ట్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
Prashanthi V
|

Updated on: Jun 22, 2025 | 8:42 PM

Share

బీట్‌ రూట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే మార్పులను తగ్గిస్తాయి. ముఖంపై కాంతి తగ్గిన వారికి ఇది సహజంగా మెరుపును ఇస్తుంది. దీని సహజ గుణాల వల్ల చర్మ కణాలు ఉత్తేజం అవుతాయి. తాజా బీట్‌ రూట్‌ ను పేస్ట్ లా చేసి ముఖానికి మాస్క్‌ లా వేసుకోవచ్చు. ఇది చర్మం లోపలికి పని చేసి మంచి కాంతిని ఇస్తుంది. అలాగే బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల శరీరం లోపల శుభ్రపడుతుంది. దీని ప్రభావం ముఖంపై సహజ కాంతిలా కనిపిస్తుంది.

బీట్‌ రూట్ పొడిని పాలు లేదా అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. తేమ కోల్పోయిన చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది చర్మానికి తేమ అందిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఈ ఫేస్‌ ప్యాక్ వారానికి రెండు మూడు సార్లు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ లేదా ఆపిల్ కలిపి బీట్‌ రూట్ జ్యూస్ తాగితే శరీరం శుభ్రపడుతుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. చర్మాన్ని తాజాగా, నిగారింపుగా ఉంచుతుంది.

ఎక్కువ వేడి వల్ల చర్మం ఎర్రబడిన వారికి బీట్‌ రూట్ చల్లదనాన్ని ఇస్తుంది. ఇది చర్మానికి తేమను అందించి.. వాడిపోయిన రూపాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బలు తగిలే వేసవిలో ఇది మంచి సహజ పరిష్కారం.

చర్మం మెరిసే కొరియన్ గ్లాస్ స్కిన్ లా కావాలంటే పాలు బీట్‌ రూట్ పొడిని కలిపి పేస్ట్‌ గా చేసి ముఖానికి రాసుకోవచ్చు. పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖానికి తెల్లని మెరుపు వస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా గ్లో చేసే గొప్ప చిట్కాల్లో ఒకటి.

బీట్‌ రూట్ సహజమైన పోషకాలు నిండిన కూరగాయ మాత్రమే కాదు. ఇది ముఖ చర్మానికి మెరుపును ఇవ్వగల చర్మ సంరక్షణ రహస్యం. ఈ సహజ చిట్కాలతో మీరు కూడా మెరిసే చర్మాన్ని సులభంగా పొందవచ్చు.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)