AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP Control Tips: ఒక్కసారిగా బీపీ పెరగితే ఏ అవయవం దెబ్బతింటుందో తెలుసా.. బీపీ అదుపులో ఉండాలంటే ఇలా చేయండి..

మీరు రక్తపోటును నియంత్రించాలనుకుంటే.. సీజనల్ ఫ్రూట్స్, తాజా కూరగాయలను తినండి. రోజూ ఒక యాపిల్ తీసుకుంటే బీపీ నార్మల్‌గా ఉంటుంది.

BP Control Tips: ఒక్కసారిగా బీపీ పెరగితే ఏ అవయవం దెబ్బతింటుందో తెలుసా.. బీపీ అదుపులో ఉండాలంటే ఇలా చేయండి..
Bp Control
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2022 | 6:56 AM

Share

అధిక రక్తపోటు అనేది ఒత్తిడి, దిగజారుతున్న జీవనశైలి, సరైన ఆహారం కారణంగా అభివృద్ధి చెందే వ్యాధి. సాధారణ రక్తపోటు 120/80 mmHg వరకు ఉంటుంది. 140/90 కంటే ఎక్కువ రక్తపోటును అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు.. శరీరంలో నొప్పి, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, తల తిరగడం వంటి లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే, మెదడు దెబ్బతినడం, పక్షవాతం, మెదడు రక్తస్రావం, గుండె, మూత్రపిండాలు, కళ్ళు దెబ్బతింటుంది. గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ కాన్పూర్‌కి చెందిన డాక్టర్ వికె మిశ్రా ప్రకారం, హైపర్‌టెన్షన్ ఎమర్జెన్సీలో రోగి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే హఠాత్తుగా హైబీపీ పెరిగితే వేగంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి. తగ్గించకపోతే శరీరంలోని కొన్ని అవయవాలకు నష్టం వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రీయంగా చెప్పాలంటే.. బీపీ ఈ పరిస్థితిని నియంత్రించడానికి, మీరు బీపీని ఒక నిమిషం నుంచి గంటలో 25 శాతం తగ్గించాలి. మీరు కూడా అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే, దానిని నియంత్రించడానికి మీ శరీర భాగాలకు హాని కలగకుండా మీరు తీసుకునే ఆహారం మెనూ మార్చుకోండి. జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురండి.

సీజనల్ పండ్లు, కూరగాయలు BP ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి:

రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే.. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను తినండి. రోజూ ఒక యాపిల్ తీసుకుంటే బీపీ నార్మల్‌గా ఉంటుంది.

ఉసిరి రసం త్రాగండి:

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి రసం, అధిక రక్తపోటును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జామకాయ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. మీకు కావాలంటే, మీరు ఉసిరి రసంలో తేనెను కూడా తీసుకోవచ్చు.

విటమిన్ సి తీసుకోండి:

మీరు హై బీపీని అదుపులో ఉంచుకోవాలంటే.. నిత్యం విటమిన్ సి తీసుకోండి. విటమిన్ సి ఉన్నటువంటి పండ్లను తినండి. విటమిన్ సి ఉన్నటువంటి ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలతో సహా అన్ని సిట్రస్‌లు విటమిన్ సి ఉత్తమ వనరులు, ఇవి బిపిని అదుపులో ఉంచడంలో అద్భతంగా పనిచేస్తాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ పండ్లన్నీ బీపీని నియంత్రిస్తాయి.

బ్రోకలీ తినండి:

ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న బ్రకోలీ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు బ్రోకలీని సలాడ్‌గా లేదా కర్రీ చేసుకుని తిన్నా మీరు హెల్తీగా ఉంటారు. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం