Type 2 Diabetes: సూప‌ర్ ఫాస్ట్‌గా షుగ‌ర్ కంట్రోల్ కావాలా.. ఈరోజే ఈ 10 ఆహారాలను వెంటనే వదిలివేయండి..

టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు షుగర్‌ను నియంత్రించడానికి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.

Type 2 Diabetes: సూప‌ర్ ఫాస్ట్‌గా షుగ‌ర్ కంట్రోల్ కావాలా.. ఈరోజే ఈ 10 ఆహారాలను వెంటనే వదిలివేయండి..
Blood Sugar
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2022 | 6:33 AM

మధుమేహం టైప్-1, టైప్-2 మధుమేహం రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.. కానీ తక్కువ చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి.. మందులు తీసుకోవడం.. ఒత్తిడికి దూరంగా ఉండటం.. ఆహారాన్ని నియంత్రించడం అవసరం. ఆహారంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా  చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో సాధారణ రక్తంలో చక్కెర స్థాయి 70-100 mg/dl ఉండాలి. చక్కెర స్థాయి 100-125mg/dl ఉంటే అది ప్రమాదకరం. టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు షుగర్‌ను నియంత్రించడానికి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.

ఆహారంలో చక్కెరను పెంచని కొన్ని ఆహారాలను తీసుకోవాలి. షుగర్ స్థాయిలను వేగంగా పెంచే కొన్ని రకాల ఆహారాలను కూడా పక్కన పెట్టాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి షుగర్ పేషెంట్లు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.