AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health Tips: కిడ్నీ బాధితలకు ఎలాంటి ఉప్పు ఆరోగ్యకరమైనదో తెలుసా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఉప్పులో లభించే సోడియం అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎలాంటి ఉప్పు ఆరోగ్యదాయకమో ఇక్కడ తెలుసుకుందాం..

Kidney Health Tips: కిడ్నీ బాధితలకు ఎలాంటి ఉప్పు ఆరోగ్యకరమైనదో తెలుసా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆహారం రుచికరంగా ఉండాలంటే, అందులో మసాలా దినుసులతోపాటు.. ఉప్పు, కారం కూడా ముఖ్యం. ఉప్పు లేకుండా ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. ఉప్పు ఆహారాన్ని రుచిగా మార్చడంతోపాటు శరీరానికి అయోడిన్‌ను ఇస్తుంది. అయోడిన్ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Jyothi Gadda
|

Updated on: Dec 06, 2022 | 9:18 AM

Share

ఆహారం రుచిగా ఉండేందుకు వంటకాల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వేస్తుంటారు. అవన్నీంటితో పాటుగా ఆహారం రుచిలో ఉప్పు పాత్ర కూడా అంతే ముఖ్యం. ఉప్పు లేకుండా ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. ఉప్పు ఆహారానికి రుచిని, శరీరానికి అయోడిన్‌ను ఇస్తుంది. అయోడిన్ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉప్పులో లభించే సోడియం అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తెల్ల ఉప్పును అధికంగా తీసుకోవడం ప్రాణాంతకం. కిడ్నీ రోగులకు ఏ ఉప్పు ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు రాళ్ల ఉప్పు మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులు ఉప్పు తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీ రోగులకు హానికరం. ఆహారంలో చిటికెడు ఉప్పు అవసరమయ్యే పరిస్థితి ఉంటే సాధారణ ఉప్పుకు బదులు రాళ్ల ఉప్పును వాడవచ్చని అంటున్నారు. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు మేలు చేస్తుంది. ఇనుము, మాంగనీస్, రాగి, నికెల్‌తో సహా రాతి ఉప్పులో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.

నిజానికి, సాధారణ ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. మూత్రపిండాల వ్యాధి విషయంలో రోగులు తక్కువ సోడియం ఉప్పు, ఆహారం తీసుకోవాలి. తద్వారా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీ సమస్యలకు రెండవ అతిపెద్ద కారణం అధిక రక్తపోటు అని నిపుణులు అంటున్నారు. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . తినడం, త్రాగడంలో నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని మలినాలను కిడ్నీలు సక్రమంగా వడకట్టలేకపోవడంతో ఈ మలినాలు రక్తంలోకి చేరుతాయి. అటువంటి పరిస్థితిలో, రక్తంలో ఎలక్ట్రోలైట్ స్థాయిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది శరీరానికి హానీ కలిగేలా చేస్తుంద.ఇ కాబట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాళ్ల ఉప్పును తినాలి. తద్వారా కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది. శరీరం వ్యాధి రహితంగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి