Vestibular Hypofunction: వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. దీని లక్షణాలేంటంటే?

|

Nov 05, 2022 | 4:35 PM

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుదై వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడీ యంగ్ హీరో. ఈ వ్యాధికారణంగా కారణంగా ప్రాథమికంగా బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని, ఫలితంగా చాలారోజుల పాటు షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నాడు

Vestibular Hypofunction: వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. దీని లక్షణాలేంటంటే?
Varun Dhawan
Follow us on

బాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్న యంగ్‌ హీరోల్లో వరుణ్‌ ధావన్‌ ఒకడు. ఇటీవల భేడియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ స్టార్‌ హీరో. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్‌ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక షాకింగ్‌ విషయం తెలిపాడు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుదై వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడీ యంగ్ హీరో. ఈ వ్యాధికారణంగా కారణంగా ప్రాథమికంగా బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుందని, ఫలితంగా చాలారోజుల పాటు షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. మరి వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్స, నివారణ పద్ధతులు తదితర విషయాలేంటో తెలుసుకుందాం రండి.

చెవిలోపలి భాగంలో..

సాధారణంగా చెప్పాలంటే,వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌ చెవికి సంబంధించిన వ్యాధి. దీనికి కారణాలు జన్యుపరమైనవి కావచ్చు లేదా న్యూరోడెజెనరేటివ్, టాక్సిక్, వైరల్ లేదా ట్రామాటిక్‌ కారణాలతో సంభవించవచ్చు. చెవిలో ద్రవంతో నిండిన సెమికర్యులర్ ఛానల్ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఈ ద్రవం స్థానం మారుతూ ఉంటుంది. చెవిలోని ఈ భాగం నుంచే డేటాను స్వీకరిస్తుంది మెదడు. ఇది దెబ్బతింటే మెదడుకు సందేశాలు సరిగ్గా పంపడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్లు తిరగడం, చూపు మసకబారడం, నడిచేటప్పుడు చూపు సమస్యలు వంటి కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో ఇది తల ఒక వైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేయవచ్చు.

ఇలా చేస్తే బెటర్‌..

దీని బారిన పడిన వారిలో వికారం, విరేచనాలు, వాంతులు, ఆందోళన, భయం, గుండె సంబంధిత వ్యాధులు కనిపిస్తాయి. వెస్టిబ్యులర్ పనితీరును మెరుగుపరచడానికి, అలాగే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. రోజూ 30 సెకన్ల పాటు తల వంచుకుని నేలకు ముఖం పెట్టి అలాగే మీ తలను పైకి లేపి సీలింగ్ వైపు చూడండి. దీన్ని రోజుకు 10 సార్లు రిపీట్ చేయండి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల క్రమంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..