ప్రాణాలు తీస్తోన్న సైలెంట్ కిల్లర్.. ‘గోల్డెన్ అవర్’లో ప్రాణాలు కాపాడొచ్చు.. ఎలాగో తెలుసా..
గుండెపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య.. గుండెపోటు సమయంలో, ప్రతి సెకను చాలా విలువైనది. గుండెపోటుకు గోల్డెన్ అవర్‌లో చికిత్స చేస్తే రోగి ప్రాణాలను కాపాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.. గోల్డెన్ అవర్ అంటే ఏమిటి...? గుండె పోటుకు ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో సైలెంట్ కిల్లర్ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే.. గుండెపోటు అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి.. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. అయితే.. గుండెపోటు సమయంలో ప్రతి సెకను చాలా విలువైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు.. గుండెపోటుకు ‘గోల్డెన్ అవర్’లో చికిత్స చేస్తే రోగి ప్రాణాలను కాపాడినట్లే.. గోల్డెన్ అవర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు మొదటిసారి గోల్డెన్ అవర్ వింటుంటే ఈ కథనం మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. గుండెపోటు లక్షణాలు.. ‘గోల్డెన్ అవర్’ అంటే ఏమిటి..? ప్రాణాంతకమైన గుండె పోటు సమయంలో తీసుకోవాల్సిన చర్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..
గుండెపోటు..
గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు. హృదయనాళ వ్యవస్థలో అడ్డంకి కారణంగా మీ గుండెకు తగినంత రక్త ప్రవాహం లేనప్పుడు సంభవిస్తుంది. అంటే అడ్డుపడిన ధమని గుండె కండరాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఇది ఛాతీ నొప్పి – శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది.. కానీ గుండె సాధారణంగా కొట్టుకోవడం కొనసాగుతుంది.
గోల్డెన్ అవర్ అంటే ఏమిటి..?
గుండెపోటు ప్రారంభమైన తర్వాత 60 నిమిషాల సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో, గుండెపోటు రోగికి చికిత్స అత్యంత అత్యవసరం.. ముఖ్యమైనది. ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన మొదటి 60 నిమిషాల సమయంలో సరైన చికిత్స అందితే, అతని ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ 60 నిమిషాలు రోగి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.. ఇంకా చికిత్స అందించి.. అతనిని కాపాడవచ్చు.. అత్యవసర వైద్య పరిస్థితి నుంచి బయటపడేలా చేయవచ్చు..
గుండెపోటు లక్షణాలు
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. భుజాలు, చేతులు, ఛాతీ, మెడ లేదా దవడలో నొప్పి… తేలికపాటి నుంచి తీవ్రమైన నొప్పి.. గుండెల్లో మంటలా ఉండటం, ఆందోళన, ఊపిరి ఆడకపోవడం, వికారం – వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి..
వాంతులు గుండెపోటుకు ముందు కనిపిస్తాయి.. చాలా మంది ఈ లక్షణాన్ని విస్మరిస్తారు.. వాంతులు అసిడిటీ వల్ల వస్తాయని భావిస్తారు. వాంతులు కాకుండా, దవడ నొప్పి, తల తిరగడం, ఛాతీ నొప్పి, భుజం లేదా చేతిలో నొప్పి, శ్వాస ఆడకపోవడం లాంటి ఈ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గుండెపోటు నివారణకు చిట్కాలు
గుండెపోటు సమస్యను నివారించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మీ బరువును అదుపులో ఉంచుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. పొగ త్రాగడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
