AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankylosing Spondylitis: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?

యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జాబితాకు చెందిన వ్యాధి. ఎక్కువగా కీళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో వస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. హెచ్ఎల్ఏ బీ27 ప్రొటీన్ జన్యువు ఉన్నవారికి యాంకిలోజింగ్ స్పాండి లైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వెన్ను పూసల మధ్యలో వాపు వచ్చిన వారికి.. అక్షరాలా నరకం కనిపిస్తుంది. వెన్నుపూసల మధ్య వాపు రావడంతో.. డిస్క్ లు వెన్నెముకను పైకి..

Ankylosing Spondylitis: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?
Ankylosing Spondylitis
Chinni Enni
|

Updated on: Aug 15, 2023 | 8:43 PM

Share

యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జాబితాకు చెందిన వ్యాధి. ఎక్కువగా కీళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో వస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. హెచ్ఎల్ఏ బీ27 ప్రొటీన్ జన్యువు ఉన్నవారికి యాంకిలోజింగ్ స్పాండి లైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వెన్ను పూసల మధ్యలో వాపు వచ్చిన వారికి.. అక్షరాలా నరకం కనిపిస్తుంది. వెన్నుపూసల మధ్య వాపు రావడంతో.. డిస్క్ లు వెన్నెముకను పైకి జరుపుతాయి. ఫలితంగా వెన్నెముకతో పాటు పెల్విస్ కీళ్లు కూడా ప్రభావితమవుతాయి. దీని ప్రభావం ఎక్కువగా కీళ్ల పైనే ఉంటుంది.

-ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు, వంశపారం పర్యంగా, జన్యు పరంగా, ఇతర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది.

-విశ్రాంతి తీసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నపుడు తీవ్రత తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

-పడుకుని లేచాక కళ్లు వాపులు, ఎర్రగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కీళ్లు, మెడ బిగుసుకుపోయి నొప్పులు పెరుగుతాయి. నిలబడిన 10 నిమిషాల లోపే విపరీతమైన నడుము నొప్పి వస్తుంది.

-ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అక్కడ ఎక్స్ రే, బ్లడ్ టెస్ట్ లు చేసి.. వ్యాధిని నిర్థారిస్తారు.

యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కు ఆయుర్వేద చికిత్స:

యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కు ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది. కానీ పూర్తిగా తగ్గాలంటే ఎక్కువ కాలం సమయం పడుతుంది. ఈ వ్యాధికి పంచకర్మ చేస్తే సుమారు 60 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఈ చికిత్స తీసుకోవాలనుకునేవారు కఠినమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా రస్రజ్రస, అశ్వగంధ చూర్ణం, ఇరందమూల చూర్ణం, చౌసత ప్రహరి, పిప్పలి చూర్ణం, త్రయోదశంగ గుగ్గుళ్లు వంటి ఆయుర్వేద ఔషధాలను వైద్యులు సూచిస్తారు. వీటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడటం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..