AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Problem: కిడ్నీల సమస్య వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? సమస్య పరిష్కారం ఏమిటి..?

ప్రస్తుతం కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా రకరకాల సమస్యలు వస్తున్నాయి. తినే ఆహారం, మానసిక ఒత్తిడి, ఆందోళన తదితర కారణాల వల్ల మనిషి రోగాల బారిన..

Kidney Problem: కిడ్నీల సమస్య వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? సమస్య పరిష్కారం ఏమిటి..?
Kidney health
Subhash Goud
|

Updated on: Feb 04, 2023 | 7:51 PM

Share

ప్రస్తుతం కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా రకరకాల సమస్యలు వస్తున్నాయి. తినే ఆహారం, మానసిక ఒత్తిడి, ఆందోళన తదితర కారణాల వల్ల మనిషి రోగాల బారిన పడుతున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతియేటా ఎందరో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇండియాలో ప్రతి సంవత్సరంల రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది.

భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.

మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల విషయాన్ని మర్చిపోతున్నారు. జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. అయితే కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..?

మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. అలసట, మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని వెల్లడిస్తున్నారు. కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంటుంది. నొప్పితో పాటు కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

కిడ్నీ సమస్యకు పరిష్కారం ఏమిటి..?

• రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి

• క్యాప్సికంలో ఉండే విటమిన్‌ఎ, సీ, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

• నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

• బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి.

• ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు, పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

• మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి