Weight Loss Exercise: బరువు తగ్గేందుకు ఈ వ్యాయామాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రమాదంలో పడొచ్చు.!

Weight Loss Exercise: బరువు తగ్గేందుకు ఈ వ్యాయామాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రమాదంలో పడొచ్చు.!
exercise

Health Tips: శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది వాస్తవం. రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పాటు

Venkata Chari

|

Feb 09, 2022 | 6:04 PM

Weight Loss Exercise: శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం(Exercise) చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది వాస్తవం. రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. అలాగే శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పాటు మానసిక స్థితి కూడా మెరుగుపడడంలోనూ వ్యాయామం సహాయపడుతుంది. ఈ రోజుల్లో బరువు పెరగడం(Weight Gain) అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ స్టైల్‌తోపాటు ఆహారపు అలవాట్లలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే, కొంతమంది బరువు తగ్గడానికి హోం రెమెడీస్ అవలంభిస్తుంటారు. మరికొంతమంది నిపుణుల సహాయంతో డైట్‌ను ఫాలో చేస్తుంటారు. ఇంకొంత మంది జిమ్‌లో కూడా చేరుతారు. బరువు తగ్గడానికి, జిమ్‌లోని శిక్షకులు అనేక రకాల వ్యాయామాలు సూచిస్తుంటారు. వ్యాయామం మీ శరీరానికి, మనస్సుకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి. ఇందులో భాగంగానే చాలా మంది వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు మీ శరీరానికి, కండరాలను ఫిట్‌గా ఉంచేందుకు సహాయపడుతుంటాయి.

చాలా ప్రజాదరణ పొందిన కొన్ని వ్యాయామాలు బరువు తగ్గడంలో సహాయపడుతుంటాయి. కానీ, వాస్తవానికి అవి మీకు చాలా హాని కలిగిస్తాయంట. ఈ వ్యాయామాలు చేసిన తర్వాత, మీరు చాలా కాలం తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యం. అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Cross fit pull ups – ఈ వ్యాయామం చేయడానికి మీకు చాలా శక్తి అవసరం అవుతుంది. ఈ వ్యాయామం మీ కండరాలకు చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంది. ఈ వ్యాయామం చేయడం వల్ల మీకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Cross Fit Pull Ups

Behind the head lat pull down – శరీరాన్ని బలోపేతం చేసేందుకు ఈ వ్యాయామం బాగా ప్రాచుర్యం పొందింది. మీరు మొదటి సారి ఈ వ్యాయామం చేస్తున్నట్లయితే, కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు, మెడ వెనుక బరువును లాగడం భుజాలు, వెన్నెముకకు హానికరంగా మారవచ్చు. బరువును లాగేటప్పుడు చాలా మంది తలని ముందుకు వంచుతారు. ఇది మెడపై ఎక్కువ ప్రెజర్ పడడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

Behind The Head Lat Pull Down

Smith machine squats – కండరాలు ఫిట్‌గా ఉండేందుకు ఈ వ్యాయామం చేస్తారు. మీరు బార్‌బెల్ లేకుండా ఈ స్క్వాట్‌లను చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మోకాళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు తీవ్రమైన ఒంటి నొప్పులతో తెగ ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Smith Machine Squats

Leg extension machine – ఈ వ్యాయామం మీ క్వాడ్ కండరాలను మెరుగుపరుస్తుంది. అయితే ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లపై చాలా ఒత్తిడి బాగా పడుతుంది. దీని వలన మీరు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ క్వాడ్ కండరాలపై పని చేయాలనుకుంటే, ప్రతికూల ప్రభావాన్ని చూపని అనేక ఇతర వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేస్తే బెటర్.

Leg Extension Machine

​Crunches – క్రంచెస్ అబ్స్ నిర్మించడానికి ఉత్తమ వ్యాయామంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల మీ పొత్తికడుపు చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. అయితే క్రంచెస్ చేయడం వల్ల మీ వీపు కింది భాగంపై ప్రభావం చూపుతుంది. నేలపై పడుకోవడం వల్ల మీ వెన్నుముక కూడా దెబ్బతింటుంది. ఇలా చేయడం వల్ల మీరు వెన్నునొప్పితో, బ్యాక్ పెయిన్‌ సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు.

Crunches

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: Chocolate Day 2022 : చాక్లెట్ డే స్పెషల్.. ఇష్టమైనవారి మనసును డార్క్ చాక్లెట్‏తో గెలుచుకోండి.. ఈ విషయాలు మీకోసం..

Radish Benefits: మొలలుతో ఇబ్బందులు పడుతున్నారా.. ముల్లంగి దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu