AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish Benefits: మొలలుతో ఇబ్బందులు పడుతున్నారా.. ముల్లంగి దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..

Radish Benefits: బంగాళా దుంప, క్యారెట్, బీట్ రూట్ ల్లానే ముల్లంగి (Radish)కూడా దుంపజాతికి చెందినదే. ఈ ముల్లంగిని ఆసియాలో రోమను పూర్వ కాలంనుంచి పెంచుతున్నారు. పచ్చిగా తింటారు..

Radish Benefits: మొలలుతో ఇబ్బందులు పడుతున్నారా.. ముల్లంగి దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..
Radish Amazing Health Benefits
Surya Kala
|

Updated on: Feb 09, 2022 | 1:34 PM

Share

Radish Benefits: బంగాళా దుంప, క్యారెట్, బీట్ రూట్ ల్లానే ముల్లంగి (Radish)కూడా దుంపజాతికి చెందినదే. ఈ ముల్లంగిని ఆసియాలో రోమను పూర్వ కాలంనుంచి పెంచుతున్నారు. పచ్చిగా తింటారు. అంతేకాదు సూప్ , కూరలు వంటివి కూడా తయారు చేస్తారు. ఈ ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తున్నారు. ఆహారంగా ఉపయోగించే ఈ ముల్లంగిలో ఎన్నో ఔషధం విలువలు ఉన్నాయి. ముల్లంగిని ఆర్ష మొలలు, దగ్గు, ఉబ్బసము, గుల్మము , నొప్పిముక్కు చెవి గొంతు వ్యాధికి ఔషధంగా ఎక్కువుగా ఉపయోగిస్తారు. ముల్లంగి దుంపలో గ్లూకోసిడ్ (glucoside), మైరోసినేసు, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఈరోజు ముల్లంగి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*ముల్లంగి కూర ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. *తిన్న ఆహారం జీర్ణం కావడానికి భోజనం తిన్న తర్వాత ముల్లంగి ముక్కలపై మిరియాల పొడి జల్లుకుని తింటే ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. *పైల్స్ తో ఇబ్బంది పడేవారికి ముల్లంగి దివ్య ఔషధం. ముల్లంగి దుంపను ముక్కలు చేసుకుని ఆ ముక్కలపై నిమ్మరసం,, మిరియాలపొడి,ఉప్పు వేసుకుని రోజుకు 3 సార్లు తింటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. *అర్షమొలలు, మలబద్దకం, అజీర్ణం, కామెర్లను నివారిస్తుంది. అంతేకాదు ముల్లంగి రసం, తేనె కలిపి తీసుకున్నా అర్షమొలలు తగ్గుతాయి. * బ్రాంకైటీస్ తో ఇబ్బంది పడేవారు ముల్లంగి రసంలో తేనె, కల్ల ఉప్పు కలుపుకుని రోజుకు 3సార్లు తీసుకుంటే బ్రాంకైటీస్ తగ్గుతుంది. *ముల్లంగి గింజలను ఆవుపాలులో వేసి మరిగించి దానిని తాగిన నపుంసకత్వం తొలగుతుంది లైంగిక శక్తి పెరుగుతుంది. *ముఖం పై మచ్చలు, మొటిమల నివారణకు ముల్లంగి గింజలను మెత్తగా నూరి ముఖానికి పట్టించి కొంత సేపు ఆరనిచ్చి కడిగితే చక్కటి ముఖ సౌందర్యం మీ సొంతం. * చర్మం పై గజ్జి ఉన్నవారు ముల్లంగి గింజలను నీటిలో నానబెట్టి గుజ్జు చేసి రాస్తే మంచి ఔషదంగా పనిచేస్తుంది. * ముల్లంగి గింజలు పొడి చేసి నీళ్లలో కలిపి రాత్రి పూట తాగితే కడుపులో పురుగులు చనిపోతాయి *ముల్లంగి ఆకులను నీటిలో వేసుకుని కషాయంగా కాచి చిటికెడు నిమ్మరసం కలిపి తాగితే మూత్రం మంట తగ్గుతుంది.

Also Read: Greenland Ice: మానవాళికి మరో పెనుముప్పు.. కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..

Viral Video: ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా.. అదిరింది గురూ అంటూ నెటిజన్లు మళ్ళీ వీడియో షేర్..

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..