Greenland Ice: మానవాళికి మరో పెనుముప్పు.. కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌.. పెరుగుతున్న సముద్ర మట్టాలు.

Greenland Ice: వాతావరంలో మార్పులు, మనషి చేసే తప్పులతో ప్రకృతిలో రోజు రోజుకీ అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకీ భూమి మీద విపరీతంగా వేడి పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో నానాటికీ మంచు కరిగిపోతున్న..

Greenland Ice: మానవాళికి మరో పెనుముప్పు.. కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌.. పెరుగుతున్న సముద్ర మట్టాలు.
Greenland Ice
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2022 | 12:16 PM

Greenland Ice: వాతావరంలో మార్పులు, మనషి చేసే తప్పులతో ప్రకృతిలో రోజు రోజుకీ అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకీ భూమి మీద విపరీతంగా వేడి పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో నానాటికీ మంచు కరిగిపోతున్న మంచుతో సముద్ర మట్టాలు పెరిగిపోతూ తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల మంచు కరిగిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికా(America)లో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌(Greenland)లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఇక్కడ 2002 నుంచి కరుగుతున్న మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్‌ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమేట్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్క్‌ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ హిమం కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.

ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా పేర్కొంది. అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్‌లాండ్‌లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాప స్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్‌లాండ్‌ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్‌ పేర్కొన్నారు. పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీని వల్ల షాంఘై నుంచి లండన్‌ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్‌లకు పెను ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read:  త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిర నిర్మాణానికి టిటిడీ సన్నాహాలు.. బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచన

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?