శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ గుండె బలహీనంగా ఉన్నట్లే..
గుండె బలహీనంగా మారినప్పుడు, శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం కావచ్చు. అటువంటి సంకేతాలను సకాలంలో గుర్తించి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.. లేకపోతే.. అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. లేదా.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.. గుండె బలహీనంగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిస్తాయో తెలుసుకోండి..

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి.. ఇది శరీరంలోని రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తుంది.. తద్వారా ఆక్సిజన్ – పోషకాలు మొత్తం శరీరానికి చేరుతాయి. కానీ నేటి కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఊబకాయం వంటి కారణంగా గుండె జబ్బుల కేసులు భారీగా పెరుగుతున్నాయి. గుండె బలహీనపడినప్పుడు, శరీరం అనేక రకాల సంకేతాలను ఇస్తుంది.. కానీ ప్రజలు సాధారణంగా ఈ సంకేతాలను చిన్నవిగా భావించి విస్మరిస్తారు. అయితే, ఈ సంకేతాలను సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభించినట్లయితే, ఏదైనా క్లిష్ట పరిస్థితిని నివారించవచ్చు. బలహీనమైన గుండె సంకేతాలు ఏమిటి..? అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అపోలో హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వరుణ్ బన్సాల్ వివరిస్తూ.. మీరు ఎక్కువ పని చేయకుండానే అలసిపోయినట్లు అనిపించడం లేదా ఊపిరి ఆడకపోవడం ప్రారంభిస్తే అది బలహీనమైన గుండెకు సంకేతం కావచ్చు.. సాధారణంగా శరీరంలోని అన్ని అవయవాలకు తగినంత రక్త సరఫరా లేనప్పుడు, వాటికి ఆక్సిజన్ అందనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తరచుగా గుండె బలహీనమైనప్పుడు, శరీరంలో కొన్ని ద్రవాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది పాదాలు, చీలమండలు, కాలి వేళ్లు లేదా కడుపులో వాపునకు కారణమవుతుంది. ఈ సంకేతాలు కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధికి సంబంధించినవి అయినప్పటికీ, ఇది గుండె జబ్బుకు కూడా సంకేతం.. అని వివరించారు.
ఛాతీ నొప్పి లేదా భారంగా అనిపించడం..
ఛాతీలో నొప్పి, ఒత్తిడి, బిగుతు లేదా భారంగా అనిపిస్తే, అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు.. ఈ నొప్పి ఎడమ చేయి, దవడ, వీపు లేదా మెడకు కూడా చేరుతుంది. ఈ లక్షణాలు పదే పదే లేదా ఎక్కువ కాలం కొనసాగితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనితో పాటు, హృదయ స్పందన చాలా వేగంగా, నెమ్మదిగా లేదా సక్రమంగా మారితే, ఇవి గుండె బలహీనతకు సంకేతాలు కూడా కావచ్చు.
గుండె బలహీనతకు కారణాలు
- అధిక రక్తపోటు
- అధికంగా కొలెస్ట్రాల్ ఉండటం
- ఊబకాయం
- ధూమపానం – మద్యం
- ఒత్తిడి – నిద్ర లేకపోవడం
- జన్యుశాస్త్రం
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..
గుండె బలహీనతకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోవాలి.. వారి సలహా మేరకు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే, అటువంటి సంకేతాలను అస్సలు విస్మరించకూడదు.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు, చేపలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి..
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి. దీనితో పాటు, ప్రతిరోజూ యోగా లేదా వ్యాయామం చేయండి.
ధూమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఒత్తిడిని తగ్గించడానికి, మీరు ధ్యానం, సంగీతం, పుస్తకాలు చదవడం లేదా మీకు ఇష్టమైన అభిరుచిని అలవర్చుకోవచ్చు.
మీ రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




