Watermelon Side Effects: ఈ వ్యక్తులు పుచ్చకాయ తినకూడదు.. తింటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
Watermelon Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది.
Watermelon Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహకరిస్తుంది. గర్భిణీ స్త్రీలు, బరువు తగ్గాలనుకునే వారు కూడా క్రమం తప్పకుండా పుచ్చకాయ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, పుచ్చకాయను అతిగా తినడం కూడా ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాత్రిపూట పుచ్చకాయ తినకూడదని సలహా ఇస్తున్నారు.
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, డయేరియా, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీని ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయను అధికంగా తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పుచ్చకాయ తింటే మరింత సమస్య పెరుగుతుందని చెబుతున్నారు. పుచ్చకాయను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ లెవల్స్ పెంచుతుంది.. పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఆహారం. దీని క్రమరహిత వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో ఉండే సహజ చక్కెర కంటెంట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తీసుకువస్తుంది.
చర్మం మార్పులు.. ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వలన చర్మం రంగు మారుతుందట. లైకోపెనీమియా సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. లైకోపీన్ అనేది యాంటీఆక్సిడెంట్, వర్ణద్రవ్యం. ఇది పుచ్చకాయతో సహా అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు రంగును ఇస్తుంది. లైకోపీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి.
బరువు పెరుగుతారు.. పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట తినడం వలన ఈ సమస్య వస్తుందని, పగటి పూట తినడం వల్ల సమస్య లేదని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ద్రువీకరించలేదు. ఆరోగ్యపరమైన సమస్యలుంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం)
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!
Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..